
Telangana Secretariat: తెలంగాణ అస్తిత్వానికి , ఆత్మగౌరవ ప్రతికగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనం (Secretariat) అట్టహాసంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ (CM KCR) చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. కాకతీయ శైలి, హిందూ, దక్కనీ శైలిలో నిర్మించిన ఈ నూతన సచివాలయంలో ఆరో అంతస్తులో సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన అందరికీ విషయం తెలిసిందే.. అయితే.. ఈ సచివాలయంలో ఏ అంతస్తులో ఏ శాఖ? ఏ ఏ వింగ్ లో ఏ మంత్రి ఉన్నారనే సందేశం చాలా మందిలో ఉంది. ఆ సందేశాలను
సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ చిన్న కథనం.
అంతస్తుల వారీగా మంత్రులు, శాఖల వివరాలు..
గ్రౌండ్ ఫ్లోర్:
1. కొప్పుల ఈశ్వర్ – షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ - (ఎ-వింగ్).
2. చామకూర మల్లా రెడ్డి – కార్మిక మంత్రి & ఉపాధి, ఫ్యాక్టరీలు, నైపుణ్యాభివృద్ధి - (బి-వింగ్).
మొదటి అంతస్తు :
1. MD.మహమూద్ అలీ – హోం, జైళ్లు & అగ్నిమాపక శాఖ – (ఎ-వింగ్)
2. ఎర్రబెల్లి దయాకర్ రావు – పంచాయతీ రాజ్ మంత్రి & రూరల్ డెవలప్‌మెంట్ RWS శాఖ- (డీ-వింగ్).
3. పట్లోళ్ల సబితా ఇంద్రా రెడ్డి – విద్య శాఖ (బి-వింగ్).
రెండవ అంతస్తు:
1. తలసాని శ్రీనివాస్ యాదవ్ – పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ -(డి-వింగ్)
2. గుంటకండ్ల జగదీష్ రెడ్డి – విద్యుత్ శాఖ- (B-వింగ్)
3. T. హరీష్ రావు - ఆర్థిక & ఆరోగ్య వైద్య శాఖ (ఎ-వింగ్)
మూడవ అంతస్తు:
1. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి – వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్ శాఖ - డి-వింగ్
2. కె. తారక రామ రావు – ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ –( A-WING).
3. సత్యవతి రాథోడ్ – గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ -(బి-వింగ్).
నాల్గవ అంతస్తు :
1. ఎ. ఇంద్రకరణ్ రెడ్డి – అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ-( A-WING)
2. వి. శ్రీనివాస్ గౌడ్ – ఎక్సైజ్, క్రీడలు & యువత , పర్యాటకం & సంస్కృతి, పురావస్తు శాఖ - (బి-వింగ్).
3. గంగుల కమలాకర్ – బీసీ సంక్షేమ శాఖ, ఆహారం & పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాలు -(డి-వింగ్).
ఐదవ అంతస్తు :
1.వేముల ప్రశాంత్ రెడ్డి – రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసన వ్యవహారాలు, హౌసింగ్ శాఖ - (ఎ-వింగ్).
2. పువ్వాడ అజయ్ కుమార్ – రవాణా శాఖ - డి-వింగ్.
ఆరవ అంతస్తు:
1. సీఎం కేసీఆర్ – సీఎం కార్యాలయం(CMO), సీఎం పేషీ, కార్యదర్శులు, ప్లానింగ్ బోర్డ్ VC – (B&C-WING).
2. చీఫ్ సెక్రటరీ + GAD - (D-WING).