హీరా గోల్డ్ నౌహీరా షేక్‌కు చుక్కెదురు: కేసులన్నీ ఎస్ఎఫ్ఓ‌కు బదిలీ

By narsimha lodeFirst Published Dec 25, 2019, 11:09 AM IST
Highlights

నౌహీరా షేక్‌కు  తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిని బెయిల్ ను మంజూరు చేసింది.

హైదరాబాద్: హీరా గోల్డ్ చీఫ్ నౌహీరా షేక్‌కు తెలంగాణ హైకోర్టు లో చుక్కెదురైంది. నౌహీరా షేక్‌పై నమోదైన కేసులన్నీ కూడ ఎస్ఎప్ఐఓకు బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు. మరో వైపు నౌహీరా షేక్‌కు బెయిల్ మంజూరు చేసింది.

also read:హీరా గోల్డ్ సీఈఓ నౌహీరా కస్టడీలోకి తీసుకొన్న ఈడీ

బుధవారం నాడు  హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ  సాయంత్రం వరకు నౌహీరా షేక్ చంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది.  నౌహీరా షేక్‌పై ఉన్న కేసులను సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకొంది. తెలంగాణ రాష్ట్రంలో నౌహీరా షేక్‌పై 10 కేసులు ఉన్నాయి.  

నౌహీరా షేక్‌పై ఉన్న కేసులన్నింటిని సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ విచారణ చేయనుంది. కోర్టులో రూ. 5 కోట్లను డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని కూడ హైకోర్టు నౌహీరా షేక్‌ను ఆదేశించింది. 

సుమారు రూ. 5600 కోట్లను నౌహీరీ షేక్ మోసం చేసిందని పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 1.72 లక్షల మంది పెట్టుబడి దారులు  మోసపోయారని పోలీసులు చెప్పారు.

కోర్టు అనుమతి లేకుండా ఆమె ఎక్కడికి వెళ్లకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టులో ఆమె పాస్‌పోర్టును సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది. 
2018 అక్టోబర్ 16వ తేదీన తెలంగాణ పోలీసులు నౌహీరా షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

click me!