స్టూడెంట్‌పై ల్యాబ్‌లోనే అసిస్టెంట్ ప్రోఫెసర్ అత్యాచారం

By narsimha lode  |  First Published Dec 25, 2019, 7:33 AM IST

హైద్రాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్ పై అసిస్టెంట్ ప్రోఫెసర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చోటు చేసుకొంది.


హైదరాబాద్: హైద్రాబాద్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినిపై అసిస్టెంట్ ప్రోఫెసర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రవల్లికి చెందిన మల్లకంటి వెంకటయ్య తార్నాకలో నివాసం ఉంటున్నాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రోఫెసర్ గా ఆయన పనిచేస్తున్నాడు.కాలేజీ ల్యాబ్ కు ఇంచార్జీగా కూడ ఆయన వ్వవహరిస్తున్నాడు.

Latest Videos

సోమవారం నాడు సాయంత్రం కాలేజీలోని ల్యాబ్ లోకి ఓ విద్యార్ధినిని పిలిచాడు. తలుపులు మూసి ఆమెపై అత్యాచారం చేశాడు. అదే రోజు సాయంత్రం తన స్వగ్రామానికి వెళ్లిన బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పింది.

బాధితురాలు మంగళవారం నాడు కుటుంబసభ్యులతో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపారు. తనతో సన్నిహితంగా ఉండాలని అసిస్టెంట్ ప్రోఫెసర్ తనను వేధింపులకు గురి చేశాడని బాధితురాలు పోలీసులకు వివరించింది.

నిందితుడు విద్యార్థినిపై అత్యాచారం చేయడానికి ల్యాబ్ లో సీసీటీవీ కెమెరాలు కూడ లేకపోవడం కలిసివచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ల్యాబ్ లో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు చెప్పారు.  మూడేళ్లుగా  ఈ కాలేజీలో నిందితుడు పనిచేస్తున్నాడు. 
 

click me!