సీఏఏ, ఎన్ఆర్‌సీ: తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో గందరగోళం

By narsimha lodeFirst Published Dec 25, 2019, 8:13 AM IST
Highlights

మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల గందరగోళంలో ఉన్నారు. 

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల గందరగోళంలో ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పార్లమెంట్‌లో సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓటు వేసింది.

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఇంకా 20 రోజుల సమయం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవలంభించే విషయమై కాంగ్రెస్ పార్టీ ఇంకా దృష్టి పెట్టలేదనే ప్రచారం సాగుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో 2014 ఎన్నికల నుండి సంప్రదాయంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ కు  ఓట్లు పడ్డాయి.ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేంద్రీకరించాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు అభిప్రాయంతో ఉన్నారు.

సీఏఏ,ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రెండు సమస్యలపై కూడ ప్రధాన ఎజెండాగా తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతలపై ఉంది.

కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం రెండు రోజుల క్రితం సమావేశమైంది. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎన్ఆర్‌సీ, సీఏఏ అంశాలు కూడ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని భావించారు.

సోమవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సత్యగ్రహం నిర్వహించింది. హైద్రాబాద్ లో సీఏఏకు వ్యతిరేకంగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా నిర్వహించింది. అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం మినహా ఇతర పెద్ద కార్యక్రమాలను కాంగ్రెస్ నిర్వహించలేదు.

జంట నగరాల్లో బీజేపీ బలంగా ఉంటుంది. దీంతో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.ఎన్ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

click me!