నాగంకు గాంధీభవన్‌లో షాక్: తొలి రోజునే ఇలా...

First Published Jun 1, 2018, 1:17 PM IST
Highlights

నాగంకు గాంధీభవన్ లో షాక్


హైదరాబాద్: మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డికి కాంగ్రెస్
పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టిన తొలి రోజునే  
ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇటీవలనే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
సమక్షంలో నాగం జనార్ధన్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆయన బిజెపికి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అయితే నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని
ఎమ్మెల్సీ కె. దామోదర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇంతకాలం పాటు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన నాగం
జనార్ధన్ రెడ్డిని పార్టీలో చేరడంపై దామోదర్ రెడ్డి తీవ్రంగా
అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుండి నాగం
జనార్ధన్ రెడ్డికి టిక్కెట్టు ఇస్తే  సహకరించేది లేదని కూడ
దామోదర్ రెడ్డి గతంలోనే ప్రకటించి సంచలనానికి
తెరతీశాడు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నాగం జనార్ధన్ రెడ్డి
తొలిసారిగా రెండు రోజుల క్రితం గాంధీభవన్ కు వచ్చాడు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు
చేశారు. నాగం ప్రెస్ మీట్ ప్రారంభించగానే విద్యుత్
సరఫరా నిలిచిపోయింది. 

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టిన  రోజునే
అపశకునం ఎదురైందని ఆయన సన్నిహితులు
అభిప్రాయపడుతున్నారు.

సెంటిమెంట్లను నాగం  విశ్వసిస్తారు. పార్టీ కార్యాలయంలో
అడుగుపెట్టిన రోజునే అపశకునం చోటు చేసుకోవడం పట్ల  
ఆయన అనుచరులను అసంతృప్తికి గురిచేసింది.


 

click me!