బాబుకు షాక్: మోత్కుపల్లితో ముద్రగడ భేటీ, ఏపీలో పర్యటనకు ఓకే

First Published Jun 1, 2018, 11:50 AM IST
Highlights

బాబుకు షాకివ్వనున్న మోత్కుపల్లి

హైదరాబాద్: మాజీ మంత్రి, టిడిపి నుండి బహిష్కరణకు
గురైన మోత్కుపల్లి నర్సింహులును కాపు ఉద్యమ నేత
ముద్రగడ పద్మనాభం శుక్రవారం నాడు హైద్రాబాద్ లో
కలిశారు.

మే 28వ తేదిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మాజీ
మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు
గుప్పించారు. ఏపీలో కాపు, బీసీల మధ్య
చంద్రబాబునాయుడు చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.
కాపులకు రిజర్వేషన్లు ఎఫ్పుడు ఇస్తారో చెప్పాలని ఆయన
డిమాండ్ చేశారు.

ఏపీలో అవసరమైతే తాను పర్యటిస్తానని ఆయన చెప్పారు.
పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను మోత్కుపల్లి
నర్సింహులును పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ  నిర్ణయం
తీసుకొన్నారు.

అయితే శుక్రవారం నాడు ఉదయం హైద్రాబాద్ లో  కాపు
ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాజీ
మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో చర్చించారు.

30 ఏళ్ళుగా టిడిపికి సేవ చేసిన మోత్కుపల్లి నర్సింహులుకు
టిడిపి అన్యాయం చేసిందని కాపు ఉద్యమ నేత ముద్రగడ
పద్మనాభం ఆరోపించారు.

ఏపీ రాష్ట్రంలో పర్యటించాలని ముద్రగడ పద్మనాభం
ఆహ్వానించారు. ఈ మేరకు తాను ఏపీలో పర్యటించేందుకు
సిద్దంగా ఉన్నానని మోత్కుపల్లి నరసింహులు కూడ
అంగీకరించారు.


బాబును ఇరుకున పెట్టే వ్యూహాం

ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడును ఇరుకున
పెట్టేందుకు మోత్కుపల్లి నరసింహులు వ్యూహరచన
చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏపీలో మాదిగ సామాజిక వర్గం
కంటే మాల సామాజిక వర్గం బలంగా ఉంటుంది.వర్గీకరణ
విషయంలో బాబు వైఖరిపై నర్నింహులు బాబును
ప్రశ్నించారు. ఇదే అంశాన్ని తీసుకొని ఏపీలో బాబు
పర్యటించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు
భావిస్తున్నారు. అంతేకాదు కాపు ఉద్యమ నేత ముద్రగడ
పద్మనాభం నరసింహులును కలవడం కూడ రాజకీయంగా
ప్రాధాన్యతను సంతరించుకొంది. ఇప్పటికే ఏపీలో ఓ మాజీ
మంత్రి  మంత్రి వర్గం నుండి స్థానం కోల్పోవడంతో బాబు
తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

click me!