చలికి వణుకుతున్న ఉత్తర తెలంగాణ.. గిన్నెధరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు..

By Sairam Indur  |  First Published Dec 22, 2023, 1:41 PM IST

ఉత్తర తెలంగాణ చలికి వణికిపోతోంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామంలో అత్యల్పంగా 6.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.


ఉత్తర తెలంగాణ చలికి గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవతున్నాయి. దీనికి తోడు చల్లగాలులు వీస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామనే ముసుగులో ఎంఐఎం వ్యాపారాలు చేస్తోంది - ఫిరోజ్ ఖాన్

Latest Videos

తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన వాతావరణ నివేదిక ప్రకారం.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సగటున 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి. అయితే తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామంలో అత్యల్పంగా 6.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 10.5 డిగ్రీలుగా నమోదైంది. బేల మండలంలో అత్యల్పంగా 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

భట్టి వ్యాఖ్యలపై నిరుద్యోగ జేఏసీ ఆగ్రహం.. కాంగ్రెస్ మేనిఫెస్టోను దహనం చేసి ఆందోళన

నిర్మల్ జిల్లాలో 10.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, పెంబి మండలంలో అత్యల్పంగా 8.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 11 డిగ్రీలు, వేమనపల్లి మండలంలో అత్యల్పంగా 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడంతో వృద్ధులు, చిన్నారులకు జనజీవనం కష్టంగా మారింది. 

పూర్తిగా చేతులెత్తేసిన బిఆర్ఎస్ ... ఏకంగా ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా

చల్లగాలులు వీస్తుండటంతో ఉదయం 9 గంటల దాకా ప్రజలెవరూ అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రోజంతా చల్లగానే ఉంటోంది. దీని వల్ల శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే చలి నుంచి రక్షించే దుస్తులు ధరించాలని, చల్లగాలి చెవిలో, ముక్కులోకి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

click me!