స్టేజ్ ఎక్కుతూ కింద పడబోయిన గవర్నర్ తమిళిసై సౌందరాజన్ .. వీడియో వైరల్

Published : Dec 22, 2023, 12:40 PM ISTUpdated : Dec 22, 2023, 07:30 PM IST
స్టేజ్ ఎక్కుతూ  కింద పడబోయిన గవర్నర్ తమిళిసై సౌందరాజన్ .. వీడియో వైరల్

సారాంశం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ స్టేజ్ ఎక్కుతూ తూలి కిందపడిపోయారు. శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్ధుల సమ్మేళనానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపైకి చేరుకునేందుకు ఆమె మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా తూలి కిందపడబోయారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ స్టేజ్ ఎక్కుతూ తూలి కిందపడిపోయారు. శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్ధుల సమ్మేళనానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపైకి చేరుకునేందుకు ఆమె మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా తూలి కిందపడబోయారు. వెంటనే అప్రమత్తమైన గవర్నర్ భద్రతా సిబ్బంది.. తమిళిసైని పైకి లేపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

 

మరోవైపు.. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్