
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడానికి సిద్ధంగా ఉంది. కొత్తరకం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఆ మహమ్మారి మన దేశంలోనూ ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉందని ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే... హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్‌పై సండే ఫన్డే బ్రేక్ పడింది. కొత్త కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా వచ్చే ఆదివారం బంద్ పెడుతున్నారు.
Also Read: బీజేపీ గూటికి మరో ఉద్యమ నేత.. తెరవెనక కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్..?
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం ప్రస్తుతం హైదరాబాద్ పై పడింది. ఈ ఓమిక్రాన్ వేరియంట్ చాలా వేగం గా వ్యాప్తి చెందడం తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఎక్కువ మొత్తం లో ప్రజలు గుమిగూడే ప్రదేశాల లో వైరస్ ఎక్కువ గా వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటం తో పలు ఆంక్షలు విధించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ సన్నదం అవుతుంది.
Also Read: పొలంలో పనిచేసి రూ. 100 సంపాదన: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రతి వారం ఎంతో సందడిగా, వేలమంది సందర్శకులతో జరిగే సండే ఫన్డే ఈవెంట్ వచ్చేవారం నిర్వహించడం లేదని, ఈ విషయాన్ని మున్సిపల్ అర్బన్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ బుధవారం తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం వేళల్లో ట్యాంక్ బండ్ పై వెహికల్స్ వెళ్లేందుకు ఎలాంటి ఆంక్షలు లేవన్నారు.
హైదరాబాద్ లో ని ట్యాంక్ బాండ్ ప్రాంతం లో నిర్వహించే సండే ఫన్ డే ను వచ్చే ఆది వారం అంటే ఈ నెల 5న రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. అలాగే ప్రజలు ఎక్కువ గా గుమిగూడ కుండా ఉండాలని తెలిపారు. ఓమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకరమైందని.. దీని పట్ల జాగ్రత్త గా ఉండాలని సూచించారు.