ఫ్యాషన్ డిజైనర్ గదిలోనుంచి దుర్వాసన.. తలుపులు పగలగొట్టి చూస్తే...

By AN Telugu  |  First Published Dec 2, 2021, 8:56 AM IST

శతాబ్ది గది నుంచి దుర్వాసన రావడంతో గమనించిన ఇరుగు పొరుగు ఇళ్ల వారు అపార్ట్మెంట్ సెక్యూరిటీ కి సమాచారం అందించారు.వారు వచ్చి తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లి చూడగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. 


హైదరాబాద్ : నగరంలోని గచ్చిబౌలి పరిధిలో ఓ Fashion designer ఆత్మహత్య చేసుకుంది.  శతాబ్ది  (32)  అనే యువతి తన ఫ్లాట్లో ఉరి వేసుకుని 
Suicideకు పాల్పడింది. శతాబ్ది గది నుంచి దుర్వాసన రావడంతో గమనించిన ఇరుగు పొరుగు ఇళ్ల వారు అపార్ట్మెంట్ సెక్యూరిటీ కి సమాచారం అందించారు.  

వారు వచ్చి తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లి చూడగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, శతాబ్ది ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Latest Videos

undefined

కాగా, నవంబర్ 12న హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ameerpeta metro station రెండో అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. నవంబర్ 12, శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సదరు యువతి మెట్రో స్టేషన్‌ రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే ఆమె అంచనా తప్పి పట్టాలమీద పడకుండా పక్కనే ఉన్న టింబర్‌ డిపోలో పడిపోయింది. 

ఆ సమయంలో శబ్దం రావడంతో వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది ఆమెను గమనించారు. వెంటనే 108 వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని యువతికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీశారు. 

ఇదిలా ఉండగా, అక్టోబర్  చివర్లో జగిత్యాలలో ముగ్గురు యువతుల ఆత్మహత్య సంచలనం సృష్టించింది.  ఏ కష్టం వచ్చిందో ఏమోగానీ ముగ్గురు మహిళలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బలవన్మరణానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరు వివాహితలు కాగా ఇంకొకరు ఇంటర్ విద్యార్థిణి. ఒకేసారి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటం జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. 

శిల్పా చౌదరి : కిలాడీ లేడీ ఉచ్చులో హీరో మహేష్ బాబు సోదరి.. రూ. 2 కోట్లు మోసపోయానంటూ ఫిర్యాదు...

వివరాల్లోకి వెళితే... jagitial పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన గంగాజల, మల్లిక, వందన గుట్టరాజేశ్వర స్వామి దేవాలయం వద్ద గల ధర్మసముద్రం చెరువులో దూకి suicide చేసుకున్నారు. ముగ్గురు మహిళలు చెరువులో దూకినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో చెరువులో గాలింపు చేపట్టారు. 

మొదట గంగాజల, మల్లిక మృతదేహాలు లభ్యమయ్యాయి. వందన మృతదేహం కోసం గాలింపు కొనసాగింది. అయితే ఈ ముగ్గురి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఒకేసారి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటంతో జగిత్యాలలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబసభ్యులు చెరువువద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

లభ్యమైన అమ్మాయిల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జగిత్యాల టౌన్ సిఐ కిషోర్ తెలిపారు. ముగ్గురి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో వున్నట్లు... మృతుల కుటుంబసభ్యుల నుండి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. 

click me!