తెలంగాణలో జనవరి 2 వరకు ఆంక్షలు: బండి సంజయ్ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు

By narsimha lodeFirst Published Dec 26, 2021, 11:46 AM IST
Highlights

హైదరాబాద్ లో  రేపు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  తలపెట్టనున్న నిరుద్యోగ దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కరోనా నేపథ్యంలో  వచ్చే ఏడాది జనవరి 2 వ తేదీ వరకు రాష్ట్రంలో ఆంక్షలను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్:omicron వైరస్ ను అరికట్టేందుకు Telangana ప్రభుత్వం రాష్టంలో వచ్చే ఏడాది జనవరి 2 వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. దీంతో Bjp తెలంగాణ చీఫ్ Bandi Sanjay ఒక్క రోజు దీక్షకు అనుమతి లేదని po liceప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించాలనే డిమాండ్ తో బీజేపీ ఆందోళనకు దిగింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ హైద్రాబాద్ లో ఒక్క రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ నేతలు పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. 

also read:దమ్ముంటే గల్లా పట్టుకుని నిలదీయి... ఆ ఉద్యోగాలెక్కడో మీ మోదీని అడుగు..: బండి సంజయ్ కి కేటీఆర్ బహిరంగ లేఖ

రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆంక్షలు విధించాలని Telangana High court సూచించింది. దీంతో రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 2 వ తేదీ వరకు  ఆంక్షలను విధిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బహిరంగ సభలతో పాటు  పెద్ద ఎత్తున  గుమి కూడడంపై ఆంక్షలను విధించింది. దీంతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన  దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

నిరుద్యోగుల సమస్యలపై బండి సంజయ్ దీక్ష

రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై బండి సంజయ్ ఈ నెల 27న దీక్షకు తలపెట్టారు.  రేపు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బండి సంజయ్ దీక్షలో పాల్గొంటారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.అంతేకాదు నిరుద్యోగులకు నెలకు రూ. 3016 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

అయితే బీజేపీ తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్షపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం  నాడు బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ దీక్షను కేటీఆర్ తప్పు బట్టారు.

ఉద్యోగ కల్పనలో మేం సాధించిన అత్యద్బుత విజయాలు మీకు తెలిసినవే అయినా తెచ్చిపెట్టుకున్న మతిమరుపుతో డ్రామా దీక్షకు దిగారు. మీ కోసం మళ్లీ ఆ విజయాలను క్లుప్తంగా గుర్తు చేస్తామని ఆ లేఖలో బండి సంజయ్ కు గుర్తు చేశారు కేటీఆర్.

ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీని మించి లక్షా ముప్ఫైమూడు వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చింది మా టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా... విప్లవాత్మకమైన టిఆర్ఎస్ ఐపాస్ విధానాన్ని తీసుకువచ్చి రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి సుమారు 16 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన చేసింది మేము కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు.వచ్చిన ఉద్యోగావాకాశాలను తెలంగాణ యువతకు దక్కేలా ప్రత్యేక శిక్షణ సంస్థ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్  నాలెడ్జ్ ని ఏర్పాటు చేసి మూడు లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది మేము కాదా అని ఆయన ప్రశ్నించారు. 


 

click me!