వివస్త్రను చేస్తున్నా కాపాడలేదు, రికార్డు చేశారు: హైద్రాబాద్ జవహర్ నగర్ ఘటనపై బాధితురాలు

Published : Aug 07, 2023, 08:56 PM ISTUpdated : Aug 07, 2023, 08:57 PM IST
వివస్త్రను చేస్తున్నా కాపాడలేదు,  రికార్డు చేశారు: హైద్రాబాద్ జవహర్ నగర్ ఘటనపై  బాధితురాలు

సారాంశం

తనను కాపాడాలని  ఎంతో ప్రాధేయపడినా కూడ  పట్టించుకోలేదని  హైద్రాబాద్ జవహర్ నగర్ లో వివస్త్రకు  గురైన యువతి ఆవేదన చెందారు.


హైదరాబాద్:  తనను వివస్త్రను  చేసేందుకు నిందితుడు  ప్రయత్నించిన సమయంలో  స్థానికులు  ఎవరూ తనకు సహయంగా రాలేదని  బాధిత యువతి  చెబుతుంది. హైద్రాబాద్  జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  బాలాజీ నగర్  బస్టాండ్ వద్ద  నడుచుకుంటూ వెళ్తున్న  యువతిపై పెద్దమారయ్య అనే వ్యక్తి  అసభ్యంగా  ప్రవర్తించాడు.  ఈ విషయమై నిలదీస్తే తనపై  దాడి చేశాడని బాధితురాలు మీడియాకు  చెప్పారు.  అంతేకాదు  తనను వివస్త్రను  చేశారని  ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే  ఈ విషయమై తనను రక్షించాలని కోరినా కూడ  ఎవరూ కూడ రాలేదన్నారు.   ఒక వ్యక్తి తనను కాపాడేందుకు  ప్రయత్నిస్తే  పెద్ద మారయ్య అతడిపై దాడికి యత్నించినట్టుగా  బాధితురాలు చెప్పారు.  స్థానికులు కొందరు  తనకు  రక్షణ రాకుండా  ఈ ఘటనను  సెల్ ఫోన్లలో రికార్డు చేశారని  ఆమె ఆవేదన వ్యక్తం  చేశారు.

also read:కీచకుడు : రోడ్డుపై వెడుతున్న యువతిని వివస్త్రను చేసి.. మందుబాబు అరాచకం

 నిందితుడు  వెళ్లిపోయిన తర్వాత వివస్త్రగా  ఉన్న తనకు  స్థానిక మహిళలు  కవరు తెచ్చి కప్పారన్నారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు  పోలీసులు పెద్దమారయ్యను అరెస్ట్  చేశారు. మద్యం మత్తులోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డారా, ఉద్దేశ్యపూర్వకంగా పాల్పడ్డారా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని  పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా ఘటనలు  మరోకరికి జరగకుండా ఉండేలా నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు  కోరుతున్నారు. 



 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే