ప్రజా యుద్దనౌక గద్దర్ అంత్యక్రియలు సోమవారం నాడు రాత్రి పూర్తయ్యాయి. అల్వాల్ లోని మహాబోధి స్కూల్ లో అంత్యక్రియలను నిర్వహించారు
హైదరాబాద్: ప్రజా యుద్దనౌక గద్దర్ అంత్యక్రియలు సోమవారంనాడు రాత్రి అధికారిక లాంఛనాలతో పూర్తి చేశారు. హైద్రాబాద్ అల్వాల్ లోని మహబోధి స్కూల్ ఆవరణలో గద్దర్ అంత్యక్రియలను నిర్వహించారు. బౌద్ధమతం సంప్రదాయాల ప్రకారంగా గద్దర్ అంత్యక్రియలను నిర్వహించారు.గుండెపోటుతో గత నెల 20వ తేదీన గద్దర్ హైద్రాబాద్ అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేరారు. గద్దర్ కు గుండెకు శస్త్రచికిత్స కూడ నిర్వహించారు. శస్త్ర చికిత్స విజయవంతమైంది.
కానీ ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో గద్దర్ మృతి చెందినట్టుగా అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి వైద్యులు నిన్న ప్రకటించారు. ఆసుపత్రి నుండి గద్దర్ పార్థీవ దేహన్ని నిన్ననే ఎల్ బీ స్టేడియానికి తీసుకెళ్లారు.ఎల్ బీ స్టేడియం నుండి ఇవాళ మధ్యాహ్నం ర్యాలీగా అల్వాల్ కు తీసుకు వచ్చారు.
సాయంత్రానికి గద్దర్ పార్థీవ దేహం అల్వాల్ కు వచ్చింది.గద్దర్ మృతిపై మావోయిస్టు పార్టీ సంతాపం తెలిపింది. గద్దర్ మృతి కలచివేసిందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు.