గద్దర్ అంతిమ యాత్రలో విషాదం.. తొక్కిసలాటలో 'సియాసత్' మేనేజింగ్ ఎడిటర్ మృతి..

Published : Aug 07, 2023, 07:48 PM ISTUpdated : Aug 07, 2023, 08:19 PM IST
గద్దర్ అంతిమ యాత్రలో విషాదం.. తొక్కిసలాటలో 'సియాసత్' మేనేజింగ్ ఎడిటర్ మృతి..

సారాంశం

Gaddar's Funeral: గద్దర్ అంత్యక్రియల సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన  ఇంటి వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు.

Gaddar's Funeral: ప్రజాగాయకుడు గద్దర్ అంతిమ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ప్రజా కవి,  గాయకుడుకు అంతిమ వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ క్రమంలో అభిమానులలో  తోపులాట జరిగింది.ఈ తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. మృతుడ్ని సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్‌గా ధృవీకరించారు పోలీసులు. తోపులాటలో కార్డియాక్ అరెస్ట్‌తోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 

ఇదిలాఉంటే.. గద్దర్ పార్థివ దేహాన్ని ఆయన ఇంటి నుంచి మహాబోధి స్కూల్ ఆవరణకు తరలించారు. గద్ధర్‌ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో.. బౌద్ధ ఆచారం ప్రకారం జరిగింది. అయితే.. గద్దర్ ను చివరి చూడటానికి భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అభిమాన గణాన్ని పోలీసులు నియంత్రించలేకపోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్