రెండు సీట్ల కేటాయింపు హామీని కాంగ్రెస్ నిలుపుకుంటుంది: సీపీఐ కార్యదర్శి కూనంనేని

By narsimha lode  |  First Published Nov 1, 2023, 2:54 PM IST

పొత్తు విషయంలో కాంగ్రెస్ తమకు ఇచ్చిన  హామీని నిలుపుకుంటుందని  సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు  చెప్పారు.



హైదరాబాద్:  తమకు రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తామని ఇచ్చిన హమీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని  సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు  విశ్వాసం వ్యక్తం చేశారు.

బుధవారంనాడు  హైద్రాబాద్ లోని సీపీఐ  రాష్ట్ర కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.తమ పార్టీతో పొత్తు విషయమై  కాంగ్రెస్ పార్టీ  నిర్ణయంలో మార్పుందని తమకు ఇంతవరకు సమాచారం లేదని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు  చెప్పారు. పొత్తు, సీట్ల విషయంలో మార్పులు చేర్పులు జరిగితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నుండి తమకు ఎలాంటి సంకేతాలు రాలేదని  సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు  చెప్పారు.

Latest Videos

కొత్తగూడెం, చెన్నూరు అసెంబ్లీ స్థానాలను ఇస్తామని కాంగ్రెస్ గతంలో తమకు హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ఇతర పార్టీల నుండి  కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయాన్ని  మీడియా ప్రతినిధులు  ప్రస్తావించారు. అయితే  ఈ విషయంత తనకు తెలియదని  కూనంనేని సాంబశివరావు చెప్పారు. వివేక్ ఎందుకు  కాంగ్రెస్ లో చేరారో తనకు తెలియదన్నారు.  రెండు రోజులు వేచి చూసిన తర్వాత  ఏం చేయాలనే దానిపై  చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఈ ఎన్నికల్లో లెప్ట్ పార్టీలతో పొత్తు లేదని బీఆర్ఎస్ తేల్చి చెప్పింది.  బీఆర్ఎస్  చీఫ్ కేసీఆర్  ఈ ఏడాది ఆగస్టు 21న  115 మందితో  అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు.తమతో పొత్తు ఉన్నప్పటికీ  ఏకపక్షంగా అభ్యర్ధుల జాబితాను ప్రకటించడంపై సీపీఐ, సీపీఎం నేతలు అసంతృప్తితో ఉన్నారు.  ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మార్చుకోవాలని భావించింది.  కాంగ్రెస్ నేతలు  సీపీఐ, సీపీఎంలతో పొత్తు చర్చలను ప్రారంభించారు. రెండు పార్టీలకు  రెండేసీ స్థానాలను కేటాయించనున్నట్టు చెప్పారు.

also read:పొత్తా, చిత్తా: కాంగ్రెస్‌తో పొత్తుపై తేల్చనున్న సీపీఎం రాష్ట్ర కమిటీ

సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. అయితే  మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ అడిగింది. అయితే మునుగోడును సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సానుకూలంగా లేదు. అయితే అదే సమయంలో  బీజేపీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ లో చేరడంతో  ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి  కాంగ్రెస్ టిక్కెట్టును కేటాయించింది.దీంతో మునుగోడు సీటు సీపీఐకి దక్కలేదు. ఈ సీటు కోసం  ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు  పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. 

click me!