పిప్పర్‌మెంట్లు, చాక్లెట్లకు ఆశపడొద్దు.. కేసీఆర్ గెలిస్తే దమ్ బిర్యానీ తినొచ్చు : కేటీఆర్ వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Nov 1, 2023, 2:30 PM IST

కాంగ్రెస్ , బీజేపీలపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. పిప్పర్ మెంట్లు, చాక్లెట్లకు ఆశపడొద్దని  కేసీఆర్‌ను గెలిపించుకుంటే ధమ్ బిర్యానీ తినొచ్చని వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్లేనని కేటీఆర్ అన్నారు.


కాంగ్రెస్ , బీజేపీలపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. బుధవారం కామారెడ్డిలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. పిప్పర్ మెంట్లు, చాక్లెట్లకు ఆశపడొద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను గెలిపించుకుంటే ధమ్ బిర్యానీ తినొచ్చని వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్లేనని కేటీఆర్ అన్నారు. కామారెడ్డి అభివృద్ధి కోసమే కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు.

ఎవరెన్ని చెప్పినా.. ఎంతగా ప్రలోభపెట్టినా ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తేనే గ్రామగ్రామాన అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. ఎంతో కష్టపడి తెలంగాణను సాధించామని.. ఈ ప్రాంతానికి చెందిన పలువురు బలిదానాలు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. 

Latest Videos

Also Read: అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తి దాడి... కేటీఆర్ ట్వీట్..

ఇకపోతే..  కేటీఆర్‌కు హైదరాబాద్ జిల్లా ఎన్నికల విభాగం నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు వినియోగించుకున్నారని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్‌కు నోటీసు జారీ చేసినట్టుగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. తొలుత ఫిర్యాదు అందిన తర్వాత మంత్రి కేటీఆర్ వివరణ కోరుతూ నోటీసు జారీ చేసినట్టుగా చెప్పారు. విచారణ అనంతరం ఎన్నికల సంఘానికి నివేదిక పంపనున్నట్టుగా చెప్పారు. 

ఈసీ మార్గదర్శకాల ప్రకారం కేటీఆర్ నుంచి సంబంధిత అధికారులు వివరణ తీసుకుంటారని తెలిపారు. అతిథి గృహాలు, బంగ్లాలు సహా ప్రభుత్వ భవనాలను ప్రచారానికి వినియోగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు డీఈఏకు  దాదాపు 120 ఫిర్యాదులు అందాయి.


 

click me!