రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు లేదు: తేల్చేసిన బండి సంజయ్

Published : Apr 01, 2021, 02:34 PM IST
రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు లేదు: తేల్చేసిన బండి సంజయ్

సారాంశం

రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు ఉండదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.  


హైదరాబాద్:రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు ఉండదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.గురువారం నాడు ఆయన హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

టీఆర్ఎస్ తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని నమ్మకం లేదన్నారు.టీఆర్ఎస్ అరాచకం స్టార్ట్ అయిందని ఆయన విమర్శించారు. సంఘ విద్రోహశక్తులకు టీఆర్ఎస్ వత్తాసు పలుకుతోందని ఆయన ఆరోపించారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. 

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గణనీయమైన కార్పోరేటర్ స్థానాలను గెలుచుకోవడం ఆ పార్టీలో ఉత్సాహం నింపింది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఓటమి పాలైంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ తన అభ్యర్ధిగా రవికుమార్ నాయక్ ను బరిలోకి దింపింది. సాగర్ లో గిరిజన ఓటర్లు తమకు గంపగుత్తగా ఓటు చేస్తారనే నమ్మకంతో బీజేపీ ఉంది. 


 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu