తెలంగాణలో ఒంటరిపోరే: బీజేపీ నేతలకు అమిత్ షా దిశా నిర్ధేశం

By narsimha lode  |  First Published Aug 27, 2023, 9:01 PM IST

తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై  పార్టీ నేతలకు  అమిత్ షా దిశా నిర్ధేశం చేశారు. 


హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై  పోరాడాలని బీజేపీ నేతలకు  కేంద్ర మంత్రి అమిత్ షా  సూచించారు.ఆదివారంనాడు  ఖమ్మంలో  రైతు గోస- బీజేపీ భరోసా  పేరుతో  నిర్వహించిన సభలో  కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

ఈ సభ ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో  అమిత్ షా  భేటీ అయ్యారు.  ఈ భేటీలో  తెలంగాణ నేతలకు అమిత్ షా దిశా నిర్ధేశం చేశారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  చర్చించారు. తెలంగాణ ఎన్నికల్లో  ఏ పార్టీతో పొత్తులు ఉండవని అమిత్ షా  పార్టీ నేతలకు  తేల్చి చెప్పారు.  ఒంటరిగానే  ఎన్నికలకు వెళ్తున్నట్టుగా అమిత్ షా స్పష్టం  చేశారు.రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుండి  బస్సు యాత్రల గురించి  అమిత్ షాతో  పార్టీ నేతలు చర్చించారు.

Latest Videos

తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులపై  నేతలు అమిత్ షాకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై  పెద్ద ఎత్తున  ఉద్యమించాలని  తెలంగాణ నేతలకు అమిత్ షా సూచించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేసే ఏ అంశాన్ని కూడ వదిలి పెట్టవద్దని అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు.రాష్ట్రంలో  బస్సు యాత్రలు చేయాలని  అమిత్ షా పార్టీ నేతలను కోరారు.

also read:మీకు నూకలు ఎప్పుడో చెల్లాయి: అమిత్ షా కు హరీష్ రావు కౌంటర్

దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణపై  బీజేపీ నేతలు  ఫోకస్ పెట్టారు. దక్షిణాదిలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో  మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ  వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణపై ఆ పార్టీ ఫోకస్ ను మరింత పెంచింది.

తెలంగాణలో  ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు వారం రోజుల పాటు పర్యటించి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై  నివేదికను ఇవ్వనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల. ఆధారంగా  ఏ వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై  ప్లాన్  చేయనున్నారు. తెలంగాణలో  జాతీయ నాయకులు,  కేంద్ర మంత్రులు, కీలక నేతలు  విస్తృతంగా  పర్యటించనున్నారు. పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేయడంపై  కొంతకాలంగా  ప్రయత్నాలను ప్రారంభించింది. 


 

click me!