సినిమా రేంజ్‌లో ఛేజింగ్‌.. దొంగలపై పోలీసుల కాల్పులు !

Published : May 29, 2023, 05:14 PM IST
సినిమా రేంజ్‌లో ఛేజింగ్‌.. దొంగలపై పోలీసుల కాల్పులు !

సారాంశం

Nizamabad: అచ్చం సినిమాలో క‌నిపించే విధంగా దొంగ‌లు పోలీసుల‌ను వెంబ‌డించారు. వారు త‌ప్పించుకునే క్ర‌మంలో సినిమా రేంజ్ లో ఛేజింగ్ చేస్తూ... దొంగ‌ల‌పై పోలీసులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.   

Nizamabad police fired on thieves: అచ్చం సినిమాలో క‌నిపించే విధంగా దొంగ‌లు పోలీసుల‌ను వెంబ‌డించారు. వారు త‌ప్పించుకునే క్ర‌మంలో సినిమా రేంజ్ లో ఛేజింగ్ చేస్తూ... దొంగ‌ల‌పై పోలీసులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి..  నిజామాబాద్‌లోని  ఇందల్వాయి మండలం జాతీయ రహదారిపై దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.  అయితే, పోలీసుల నుంచి దొంగ‌లు త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. పోలీసులు ఛేజింగ్ చేసే క్ర‌మంలో పారిపోతున్న దొంగలపై కాల్పులు జరిపారు. గ‌త కొంత కాలంగా ఈ ప్రాంతంలో దొంగ‌ల హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. ఈ దొంగ‌ల ముఠా స‌భ్యుల‌ను రాజస్థాన్‌కు  చెందిన వారిగా గుర్తించారు. 

పోలీసులు వారిని ప‌ట్టుకోవ‌డానికి ప‌క్కా స్కేచ్ వేసి.. దొంగ‌ల ముఠాను పట్టుకునేందుకు కాపు కాశారు. అయితే, ఈ విష‌యం తెలుసుకున్న దొంగ‌లు పోలీసుల కారును ఢీకొట్టి పారిపోయారు. ఈ క్ర‌మంలోనే వారిని పట్టుకునేందుకు పోలీసులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Independence Day Speech
సంగారెడ్డి సభకి సినిమా రేంజ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ | Cm Revanth Reddy Mass Entry