నాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు: పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరికపై ఈటల

By narsimha lode  |  First Published May 29, 2023, 4:33 PM IST

మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు  బీజేపీలో  చేరికపై  మాజీ మంత్రి  ఈటల రాజేందర్  కీలక వ్యాఖ్యలు  చేశారు. ప్రతి రోజూ  ఈ ఇద్దరు  నేతలతో మాట్లాడుతున్న విషయాన్ని ఈటల  రాజేందర్ గుర్తు  చేశారు. 


 

హైదరాబాద్:  మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు , మాజీ ఎంపీ  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డిలు బీజేపీలో  చేరడం కష్టమేనని  మాజీ మంత్రి ఈటల రాజేందర్  చెప్పారు. సోమవారంనాడు  బీజేపీ చేరికల కమిటీ  చైర్మెన్,  మాజీ మంత్రి  ఈటల రాజేందర్  మీడియాతో మాట్లాడారు. పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి,  జూపల్లి కృష్ణారావులు  బీజేపీలో  చేరికపై  ఆయన  కీలక వ్యాఖ్యలు  చేశారు. ప్రతి రోజూ తాను  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  జూపల్లి కృష్ణారావులతో  మాట్లాడుతన్నానని  ఆయన  చెప్పారు. ఖమ్మం  జిల్లాలో  కాంగ్రెస్ బలంగా  ఉంది, బీజేపీ లేదన్నారు. 

Latest Videos

undefined

పొంగులేటి ,జూపల్లి  తనకే రివర్స్  కౌన్సిలింగ్  ఇస్తున్నారని  ఈటల రాజేందర్  చెప్పారు. ఇప్పటివరకు  వారు కాంగ్రెస్ లో  చేరకుండా ఆపగలిగినట్టుగా ఈటల రాజేందర్  వివరించారు.  బీజేపీలో  ఈ ఇద్దరూ నేతలు  చేరేందుకు వారికి    కొన్ని  ఇబ్బందులున్నాయని ఈటల రాజేందర్  తెలిపారు. 

ఖమ్మంలో  ఇప్పటికీ  కమ్యూనిష్టు  ఐడియాలజీ బలంగా  ఉందన్నారు.  దేశానికి  కమ్యూనిష్టు  సిద్దాంతం  నేర్పిన గడ్డ తెలంగాణే అనే విషయాన్ని  ఈటల రాజేందర్ గుర్తు  చేశారు. ఖమ్మంలో  వామపక్షాలు, టీడీపీ సహా  అన్ని పార్టీలున్నాయన్నారు. 

also read:జూన్ మొదటి వారంలో న్యూఢిల్లీకి జూపల్లి: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి?
 
ప్రియాంకగాంధీని  అప్పట్లో పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  కలుస్తారని  తెలిసిందన్నారు. దీంతో   అంతకంటే ముందే  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో  చర్చించినట్టుగా  ఈటల రాజేందర్ గుర్తు  చేశారు. 

ఈ ఏడాది  ఏప్రిల్  10వ తేదీన  మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు,  మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డిలపై   బీఆర్ఎస్ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది.  ఈ ఇద్దరు  నేతలతో  బీజేపీ, కాంగ్రెస్  నాయకులు  చర్చిస్తున్నారు.  గత మాసంలో  మాజీ మంత్రి ఈటల రాజేందర్   ఖమ్మంలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,   జూపల్లి కృష్ణారావులతో  చర్చలు జరిపారు.  ఇటీవల  కూడా  ఈ ఇద్దరితో  మాజీ మంత్రి ఈటల రాజేందర్  చర్చించారు.  కానీ ఈ ఇద్దరు  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో  చేరే విషయమై  స్పష్టత  ఇవ్వలేదు.

ఇదిలా  ఉంటే మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు  జూన్ మొదటి వారంలో న్యూఢిల్లీకి వెళ్తారని  ప్రచారం  సాగుతుంది.    కాంగ్రెస్ లో  చేరేందుకే  జూపల్లి కృష్ణారావు  ఢిల్లీకి వెళ్లనున్నారని  ప్రచారం సాగుతుంది. 

click me!