హరికృష్ణ మృతి: అతను డ్రైవర్‌గా చేరి ఉంటే..

Published : Aug 30, 2018, 10:41 AM ISTUpdated : Sep 09, 2018, 11:17 AM IST
హరికృష్ణ మృతి: అతను డ్రైవర్‌గా చేరి ఉంటే..

సారాంశం

హరికృష్ణ కొంత కాలంగా  ఓ డ్రైవర్ కోసం వెతుకుతున్నాడు. 15 రోజుల క్రితం డ్రైవర్ గా పనిచేసేందుకు వచ్చిన ఓ యువకుడి జాతకం చూపించారు. అయితే కొన్ని షరతులను హరికృష్ణ చెప్పాడు


హైదరాబాద్: హరికృష్ణ కొంత కాలంగా  ఓ డ్రైవర్ కోసం వెతుకుతున్నాడు. 15 రోజుల క్రితం డ్రైవర్ గా పనిచేసేందుకు వచ్చిన ఓ యువకుడి జాతకం చూపించారు. అయితే కొన్ని షరతులను హరికృష్ణ చెప్పాడు. షరతులకు డ్రైవర్ ఒప్పుకోలేదు. అయితే  ఈ షరతులకు  ఒప్పుకోని  డ్రైవర్ విధుల్లో చేరలేదు.

కొంతకాలంగా మంచి డ్రైవర్‌ను చూడాలని  నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌బాబును హరికృష్ణ కోరారు. అయితే హరికృష్ణ సూచన మేరకు  అమర్‌నాథ్  బాబు ఓ  డ్రైవర్‌ను  పంపాడు.

విధుల్లో చేరేందుకు వచ్చిన డ్రైవర్ బయోడేటాను చూసి.. జాతకం కూడ  చూయించాడు హరికృష్ణ. అయితే ఈ జాతకం ప్రకారంగా ఎక్కువ కాలం స్థిరత్వంగా ఉండడని తేలడంతో డ్రైవర్ ను విదుల్లో చేర్చుకొనే విషయమై హరికృష్ణ ఆలోచించాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మరోవైపు  రాత్రి పూట ఆహ్వానం హోటల్‌లోనే పడుకోవాలని, సిటీలో 80 కి.మీ. వేగంతో, ఇతర ప్రాంతాల్లో 100 కి.మీ వేగంతో వెళ్లాలని హరికృష్ణ కోరినట్టు చెప్పారు. అయితే ఈ షరతులు నచ్చని కారణంగా విధుల్లో చేరేందుకు ఆ వ్యక్తి కూడ రాలేదు. విధుల్లో చేరేందుకు ఆ వ్యక్తి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని హరికృష్ణ సన్నిహితులు చెబుతున్నారు. 

ఈ వార్తలు చదవండి

సిద్దాంతి ముందే హెచ్చరించాడు: అయినా హరికృష్ణ

హిందూపురంతో హరికృష్ణ బంధం ఇదీ...

హరికృష్ణ: రోజులో ఎక్కువ టైమ్ 1001 రూమ్‌లోనే, ఎందుకంటే?

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

 

PREV
click me!

Recommended Stories

Holidays : ఇంకో రెండ్రోజులే స్కూళ్లు నడిచేది.. వరుసగా నాల్రోజులు సెలవులే
Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. Governor Telugu Speech | Asianet News Telugu