
నిర్మల్ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఇందులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో భయటపడ్డారు. డ్రైవర్ చాకచక్యంగా వహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిర్మల్ డిపోకు చెందిన బస్సు.. కామల్ వెళ్లి వస్తోంది. మామడ మండలం ఆదర్శనగర్ వద్దకు చేరుకోగానే అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్పు వేగంగా ఉండటంతో దానిని అదుపు చేయడం చాలా డ్రైవర్ కు చాలా కష్టతరమైంది. అయినా డ్రైవర్ కొంత సమయస్ఫూర్తి ఉపయోగించి బస్సు ను కంట్రోల్ చేశాడు. లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 60 మందికి వరకు ఉన్నారు. అందులో ఉన్న ప్రయాణికుల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
పెరుగుతున్న బస్సు ప్రమాదాలు...
ఇటీవల బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. సురక్షితమని భావించే ఆర్టీసీ బస్సులకే ఇలా జరుగుతుండటం ఆందోళన చెందాల్సిన విషయం. ఇలాంటి ఘటన తెలంగాణలోనే కాదు ఇటీవల ఏపీలోని చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లా బాపట్ల ప్రాంతంలో గురువారం ఓ బస్సు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లాలోని కాకుమాను నుండి బాపట్లకు ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పింది. గుంతలను తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న బాపట్ల-నందిపాడు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. పలువురు స్వల్ప గాయాలతో భయటపడ్డారు.
డివైడర్ ఢీకొన్న కారు, డ్రైవర్ సహా ఇద్దరు లేడీ జూనియర్ ఆర్టిస్టుల మృతి
పశ్చిమ గోదావరి ఘటనలో 8 మంది..
ఏపీలోని పశ్చిమ గోదావరిలో జరిగిన ఘటన ఇటీవల ఎక్కడా జరగలేదు. ఈ బస్సు ప్రమాదంలో డ్రైవర్ తో పాటు ఎనిమిది మంది మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెంకు దాదాపు 43 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ క్రమంలో జల్లేరు వాగుపై గల వంతెనపై ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సు అమాంతం వంతెనపైనుండి వాగులోకి పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా పదిమంది మరణించారు. కొండగట్టు బస్సు ప్రమాదం తరువాత ఎక్కువ మంది ఈ ఘటనలోనే చనిపోయారు.
2018 సంవత్సరంలో జగిత్యాల జిల్లాలోని మల్యాల మండల పరిధిలోని కొండగట్టు ప్రాంతంలో బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 65 మంది మృతి చెందారు. పరిమితికి మించిన ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు.. కొండగట్టు ఘాట్‌ల వద్ద అదుపుతప్పిలోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 24 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 41 మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఫిట్‌నెస్ లేని బస్సులు నడపటం, డ్రైవర్లకు విశ్రాంతి ఇవ్వకుండా పని చేయించుకోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మితిమీరిన వేగం కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.