
పెరిగిన టెక్నాలజీని మంచి పనుల కోసం కంటే చెడ్డ పనులు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈజీ మనీ కోసం టెక్నాలజీని వాడుకొని అమాయకులను బలి చేస్తున్నారు. ప్రతీ రోజు ఇలాంటి మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ మోసాలపై పోలీసులు, సామాజిక కార్యక్తలు ఎంత ప్రచారం చేస్తున్నా.. చాలా మంది వీరిబారిన పడుతున్నారు. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఇప్పుడొకటి హైదరాబాద్‌లో జరిగింది.
య్యూటూబ్‌లో చూసి...
అతడు బీటెక్ పూర్తి చేశాడు. తన ఊరిలో ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నాడు. గతేడాది విధించిన లాక్ డౌన్ సమయంలో, కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఆ సంస్థ ద్వారా పలువురికి సాయం కూడా చేశాడు. అయితే ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ సంస్థను నిర్వహించలేకపోయాడు. ఆ సంస్థ ద్వారా సాయం చేయాలని ఉన్నా ఇంకా ఎవరికీ సాయం చేయలేకపోయాడు. డోనేన్షన్ కూడా రాకపోవడంతో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. దీని నుంచి ఎలా భయటపడాలా అని ఆలోచించాడు. అయితే ఇంత వరకు మంచి పనులే చేసిన అతను.. ఆ సంస్థను ద్వారా సేవా కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన డబ్బు సమకూర్చేందుకు ప్రాడ్ చేయాలని భావించాడు. డబ్బులు ఎలా తొందరగా సంపాదించాలని సెర్చ్ చేయడం ప్రారంభించాడు. యూట్యూబ్‌లో కోసం దీని కోసం వెతికాడు. అక్కడే అతనికి పెళ్లికి సంబంధించిన యాప్స్ ద్వారా ప్రాడ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసింది. ఆ వీడియోలలో చెప్పినట్టు చేయడం ప్రారంభించాడు. అందులో భాగంగానే ఇంటర్ నెట్ నుంచి కొన్ని ఫొటోలు సేకరించాడు. వాటి ద్వారా ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. అలా ఒకరితో పరిచయం పెంచుకొని.. వారి ద్వారా ఏడాదిలో రూ.8 లక్షల వరకు సంపాదించాడు. చివరికి బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నింధితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలు వెళ్లడించారు.
లోన్ యాప్స్ కేసులో మరో కొత్త కోణం.. రూ. 14 వేల కోట్లకు విదేశాలకు.. !
టెక్కికే టోకరా..
దుబ్బాకకు పట్టణానికి చెందిన పృథ్వీరాజ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అక్కడే ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో చాలా మందికి ఆ సంస్థ ద్వారా సాయం అందించాడు. ఆర్థిక వనరులు అయిపోవడం, దాతలు కూడా ముందుకు రాకపోవడంతో సంస్థ నడవడం కష్టం అయ్యింది. దీంతో య్యూటూబ్ ద్వారా ఈజీ మనీ ఎలా సంపాదించాలో తెలుసుకున్నాడు. ఇంటర్ నెట్ నుంచి అమ్మాయిల ఫొటోలు డౌన్‌లోడ్ చేశాడు. ఓ మహిళ పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి.. అందులో ఓ అమ్మాయి ఫొటోలు అప్‌లోడ్ చేసి.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ టెక్కీకి రిక్వెస్ట్ పెట్టాడు. అతడు దానిని యాక్సెప్ట్ చేశాడు. కొన్నాళ్లు చాటింగ్ చేయడంతో ఆ టెక్కి.. ఇటు నుంచి ఛాట్ చేస్తున్నది మహిళే అనుకున్నాడు. కొన్నాళ్లకు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. వాట్సప్ ద్వారా కూడా చాటింగ్ చేసుకున్నారు. వాట్సప్ డీపీ కూడా ఆ మహిళ పిక్ నే ఉంచి చాటింగ్ చేయడంతో ఆ టెక్కికి అసలు అనుమానమే రాలేదు. కొన్నాళ్ల తరువాత పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. ఈ క్రమంలో పలు అవసరాల కోసమని చెప్పి.. డబ్బులు అకౌంట్లో వేయించుకున్నాడు. ఇలా ఏడాది కాలంలో ఎనిమిది లక్షల వరకు సేకరించారు. కొన్నాళ్లకు అనుమానం వచ్చిన ఆ టెక్కీ తాను మోసపోయానని గ్రహించాడు. దీంతో పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి నిందితుడిని, అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అన్ని విషయాలు బయటపెట్టాడు. ఆ టెక్కి నుంచి సేకరించిన డబ్బును సేవా కార్యక్రమాలకు ఉపయోగించానని, తను కొంత వాడుకున్నానని చెప్పాడు.