రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలక పాత్ర వహిస్తుంది.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

By Sumanth Kanukula  |  First Published Dec 18, 2021, 12:33 PM IST

దేశంలోనే తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (International arbitration and mediation centre) హైదరాబాద్​లో ఏర్పాటైంది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం హైదరాబాద్‌లో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 


దేశంలోనే తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (International arbitration and mediation centre) హైదరాబాద్​లో ఏర్పాటైంది. హైదరాబాద్​ నగరంలోని నానక్​రామ్​గూడ ఫొనిక్స్ వీకే టవర్​లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana), తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కోహ్లి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా CJI NV Ramana మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం హైదరాబాద్‌లో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే కేసీఆర్ అంగీకరించారని అన్నారు. చాలా తక్కువ సమయంలో ఐఏఎంసీ ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ అభివృద్దికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. వివాదాల పరిష్కారంలో జాప్యం జరిగితే నష్టం జరుగుతుందని అన్నారు. 

Latest Videos

Also read: ఐఏఎంసీని ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్..

ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన కేసుల పరిష్కారం అవుతుందని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. తక్కువ వ్యయంతో స్వల్ప సమయంలో పరిష్కారమే లక్ష్యమన్నారు. ఆర్బిట్రేషన్, మీడియేషన్ ప్రక్రియకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలక పాత్ర వహిస్తుందని చెప్పారు. అన్ని రకాల కేసుల్లో మధ్యవర్తిత్వాన్ని ఇది ప్రోత్సహిస్తుందని తెలిపారు. 

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ప్రేమించే వాళ్లలో జస్టిస్ ఎన్వీ రమణ ఒకరని అన్నారు. హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు కావడానికి  జస్టిస్ ఎన్వీ రమణ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు మించి హైదరాబాద్ పురోగమిస్తుందని చెప్పారు. ఐఏఎంసీ దేశానికి, తెలంగాణకు మంచి పేరు తెస్తుందని అన్నారు. ఐఏఎంసీ.. దేశానికి, రాష్ట్రానికి, న‌గ‌రానికి మంచి పేరు ప్ర‌తిష్ఠ‌లు సంపాదిస్తుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. త‌ప్ప‌కుండా ఈ సెంట‌ర్ అన్ని విధాలుగా ముందుకు పురోగ‌మిస్తుంద‌న్న న‌మ్మ‌కం తనకు ఉందన్నారు.  

click me!