చిన్నారి మృతి కేసులో వీడిన మిస్టరీ.. వర్షితది ఆత్మహత్యే...

By SumaBala Bukka  |  First Published Jul 21, 2022, 10:16 AM IST

బిల్డింగ్ మీదినుంచి దూకిన తొమ్మిదేళ్ల చిన్నారి మృతి కేసులో మిస్టరీ వీడింది. వర్షిత ఆత్మహత్య చేసుకుందని పోలీసు ప్రాథమిక విచారణలో తేలింది.


హైదరాబాద్ : ఎన్నో అనుమానాలు, అనేక ప్రశ్నలు లేవనెత్తిన బాలిక సమృద్ధి కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మంగళవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోఆరో తరగతి విద్యార్థిని తొమ్మిదేళ్ల వర్షిత నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎల్బీనగర్ ఏసిపి శ్రీధర్ రెడ్డి తెలిపారు. బాలిక మృతి పట్ల వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. బాలికను తీసుకుని వచ్చిన ఆటో డ్రైవర్ దుర్గేష్ ను విచారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏసీపీ కథనం ప్రకారం వివరాలు.. మన్సురాబాద్ లోని మధురానగర్ లో కాలనీ రోడ్డు నంబర్ - 5లో ఉంటున్న సత్యనారాయణ రెడ్డి, ప్రభావతి దంపతుల కూతురు వర్షిత.

మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన బాలిక చిప్స్ కొనుకుంటానంటూ దుకాణానికి వెళ్లింది. మన్సూరాబాద్ చౌరసాకు వచ్చి.. ఆటో ఎక్కింది. అక్కడ నుంచి ఎల్ బీనగర్ చౌరస్తా మీదగా చంద్రపురి కాలనీ రోడ్డునెం. 2/బీకు వెళ్లి ఆటో అతని రూ. 50 ఇచ్చి అక్కడ దిగింది. ఆటోలో వెళ్లే క్రమంలో తన తండ్రికి ఫోన్ చేయాలని డ్రైవర్ కు నంబర్ చెప్పింది. ఫోన్ బిజీగా రావడంతో ఆటో డ్రైవర్ వర్షితను అపార్ట్ మెంట్ వద్ద దించేశాడు. అక్కడ ఉన్న వాచ్ మన్ వెంకటమ్మ వర్షిత బిల్డింగ్ పైకి వెళ్తుండగా, ఎవరు కావాలని అడిగింది. మా నాన్న కోసం వచ్చానంటూ చెప్పి బిల్డింగ్ పైకి వెళ్లింది. 

Latest Videos

undefined

బిల్డింగ్ మీదినుంచి దూకి తొమ్మిదేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి..

వాచ్ మన్ తన కుమారుడైన రాజున బిల్డింగ్ పైకి పంపగా ఎవరూ కనిపించలేదు. ఇంతలోనే వర్షిత నాలుగో అంతస్తుపై నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి కావాలనే నాలుగో అంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాలిక వర్షితపై లైంగిక దాడి జరిగిందా? అనే కోణంలో వైద్య పరీక్షలు చేయగా, అలాంటిదేమీ లేదని వెల్లడైందన్నారు. చదువులో ముందుండే వర్షిత.. అందరితోనూ కలుపుగోలుగా మసలుకునేదని కాలనీవాసులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబంలో నెలకొన్ని ఘర్షణల నేపథ్యంలో సున్నిత మనస్కురాలైన వర్షిత కొంత ప్రభావితమై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సమాచారం. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్, ఎల్బీనగర్ లో ఓ తొమ్మిదేళ్ల బాలిక మృతి కేసు మిస్టరీగా మారింది. బిల్డింగ్ మీదినుంచి కిందపడి తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ లో నివాసం ఉంటున్న సత్యనారాయణ రెడ్డి రెండో కూతురు వర్షిత (9) కిరాణా షాపుకు వెళ్లి వస్తానని తల్లికి చెప్పి బైటికి వచ్చింది. అలా వచ్చిన చిన్నారి ఓ ఆటోను పిలిచి అందులో చంద్రపురి కాలనీలోకి ఓ బిల్డింగ్ గ్ మీదికి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకేసింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

click me!