చంపి.. ఉరేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి.. ఒకరి దారుణ హత్య..

Published : Jul 21, 2022, 09:42 AM IST
చంపి.. ఉరేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి.. ఒకరి దారుణ హత్య..

సారాంశం

నిజామాబాద్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని చంపి, ఉరేసిన దుండగులు.. కాళ్లు కట్టేసి..చెట్టుకు వేలాడదీసి పెట్రోల్ పోసి.. తగలబెట్టారు. 

నిజామాబాద్ : నిజామాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత చెట్టుకు ఉరి వేశారు. అంతటితో ఆగలేదు.. మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్ర పల్లిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రపల్లికి చెందిన పెద్దింట్ల పోశెట్టి మంగళవారం ఉదయం బ్యాంకుకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళాడు. సాయంత్రం  అయినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. అయితే, తను వేరే పనిలో ఉన్నానని.. రాత్రి వరకు ఇంటికి వస్తానని అతను చెప్పాడు.  

కానీ, రాత్రి అయిన ఇంకా ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు మళ్లీ ఫోన్ చేయగా ఫోన్ ఎత్తలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిప్లై లేదు.  దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు  తెలిసిన వాళ్ళు అందరిని అడిగారు. అయితే బుధవారం ఉదయం పోశెట్టి మృతదేహాన్ని గ్రామశివారులో స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు చెప్పడంతో.. డిసిపి అరవింద్,  ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐ నరేష్, ఎస్సై యాదగిరి గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ పరిశీలించారు. అది కొద్ది దూరం వెళ్లి ఆగిపోయింది. 

బోనాల ఉత్సవాల్లో మహిళలకు వేధింపులు.. 8 మంది పోకిరీలకు జైలు శిక్ష

కుటుంబ సభ్యులు నలుగురు అనుమానితులు పేర్లు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. 
పోశెట్టి రెండు కాళ్లు కట్టేసి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమిక దర్యాప్తులో, తేలిందని, విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ నరేష్ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దంపతుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు ఆయనకు ఇద్దరు కొడుకులున్నారు. వ్యవసాయ కూలీలుగా పని చేసే పోశెట్టి గ్రామంలో అందరితో కలివిడిగా ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. 

అయితే, పోశెట్టికి ఆర్థికపరమైన లావాదేవీలు, తగాదాలు ఉన్నాయని.. అదే క్రమంలో ఈ రోజు భూవివాదంలో ఉన్న కేసు విషయంలో కోర్టుకు హాజరు కావాల్సి ఉందని మృతుని కుమారుడు తెలిపాడు. తన తండ్రిని చంపిన వారిని శిక్షించాలని పోలీసులను వేడుకున్నాడు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకే.. చంపి, ఉరేసిన నిందితులు.. శవాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారని అనుమానిస్తున్నారు. సగం కాలి బిగుసుపోయిన పోశెట్టి మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ