గొర్రెకుంట బావిలో 9 మృతదేహాల ఘటనపై 9 టీములతో దర్యాప్తు: సీపీ రవీందర్

By narsimha lodeFirst Published May 22, 2020, 1:05 PM IST
Highlights

మక్సూద్ కు చెందిన ఇద్దరు కొడుకులతో పాటు, మరో ఇద్దరు బీహార్ యువకులు ఎక్కడికి వెళ్లారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నామని వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు.

వరంగల్: గొర్రెకుంట బావిలో తొమ్మిది మంది మృతిపై దర్యాప్తు చేస్తున్నామని  వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు.శుక్రవారం నాడు గొర్రెకుంట బావి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన ఎలా చోటు చేసుకొందనే విషయమై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

ఈ కేసు విచారణకు గాను పలు టీమ్ లు విచారణ చేస్తున్నామన్నారు.  గొర్రెకుంట బావిలో 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపామని సీపీ రవీందర్ తెలిపారు.

also read:హత్యలా, ఆత్మహత్యనా: వరంగల్‌లో బావిలో శవాలుగా తేలిన తొమ్మిది మంది వలస కూలీలు

ఈ ఘటనపై విచారణకు 9 మంది టీమ్ లను ఏర్పాటు చేశారు. సివిల్ పోలీసులతో ఐదు టీమ్‌లను, స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో మరో నాలుగు టీమ్‌లను పోలీసులు  ఏర్పాటు చేశారు. ఈ 9 టీమ్ లు దర్యాప్తును వేగవంతం చేసినట్టుగా సీపీ రవీందర్ తెలిపారు.

గొర్రెకుంట బావిలో గురువారం నాడు రాత్రి నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇవాళ ఐదు మృతదేహాలు దొరికాయి. మొత్తం 9 మంది మృతి ప్రస్తుతం వరంగల్ లో సంచలనంగా మారింది. మృతుల బంధువులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. సంఘటన స్థలాన్ని వరంగల్ మేయర్ పరిశీలించారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు  చేస్తున్నట్టుగా సీపీ తెలిపారు.

మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. 
 

click me!