తెలంగాణలో కరోనా టెస్టులూ తక్కువే... కేసులూ తక్కువే: ఉత్తమ్ కుమార్ రెడ్డి

By Arun Kumar P  |  First Published May 21, 2020, 9:51 PM IST

తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం వల్లే  రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 


జగిత్యాల: తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా బయటపడుతున్నాయని... రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తక్కువ కరోనా టెస్టులు చేస్తుండటం వల్లే ఇలా జరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పక్క రాష్ట్రాల్లో ఇప్పటివరకు 2 లక్షల టెస్టులు చేస్తే తెలంగాణలో కేవలం 22 వేల టెస్టులే చేశారని అన్నారు. 

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పని చేయడం లేదన్నారు. ఐసీఎంఆర్ ప్రయివేటు దవాఖానలలో టెస్టులు చేయాలని తాము చెబితే ప్రభుత్వం పట్టించుకోలేదని... చివరకు హైకోర్టు చెప్పేవరకు పట్టించుకోలేదన్నారు. 

Latest Videos

undefined

రాష్ట్రంలో వలస కూలీలు ఎంత మంది ఉన్నారో కూడా ప్రభుత్వం చెప్పలేకపోతుందని... ఇక వీరు వాళ్లకు ఏం తిండి పెడతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ వలస కులీలకు రవాణా ఖర్చులు చెల్లించారని... ఆమె సేవాగుణానికి టిపిసిసి తరపున అభినందిస్తున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. 

READ MORE  కరోనా వల్ల తెలంగాణకు లాభమే.. నష్టమేమీ లేదు: రేవంత్ రెడ్డి సంచలనం

కేంద్రం నుండి మాత్రమే కాకుండా వివిధ వర్గాల నుండి వచ్చిన విరాళాలకు సంబంధించిన వివరాలు చెప్పాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణ కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. 

మహ్మద్ బిన్ తుగ్లక్ కంటే  కేసీఆర్ ఎక్కువ చెబుతున్నారని...కందులు కొని 3 నెలలు గడిచినా ఇంకా డబ్బులు ఇవ్వలేదు కానీ మళ్ళీ కందులు వేయమంటారా అని అడిగారు. 
రైతు బంధు పతకంలో మోసం దాగివుందని...  గతంలో హుజూర్ నగర్ లో ఎన్నికలు వున్నాయని రైతుబందు ఇచ్చారని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏ స్థాయిలోనైనా పోరాడతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. 

''విత్తనాలు అమ్మవద్దని చెప్పడానికి మీరెవరు...పత్తి విత్తనాల కంపెనీలతో మీకు మతలబు ఉంది...పత్తి 7 వేలకు కొంటేనే వేయమని చెప్పాలి...నూనె గింజలకు, పప్పు ధాన్యాలకు తగిన ధర ఇచ్చి పంటలు వేయమని చెప్పాలి'' అని ఉత్తమ్ సూచించారు. 
 

click me!