సూర్యాపేటలో విషాదం: మూడురోజుల క్రితం అదృశ్యమైన యువకుడు నిఖిల్ హత్య

By narsimha lode  |  First Published Oct 12, 2022, 5:53 PM IST

సూర్యాపేట జిల్లాలో నిఖిల్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  సాగర్ కాలువలో నిఖిల్ డెడ్ బాడీ లభ్యమైంది.


 సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు  మండలం కట్టుకొమ్మగూడెం నాగార్జునసాగర్ కాలువలో నిఖిల్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.ఈ నెల 9వ తేదీ రాత్రి నుండి నిఖిల్ కన్పించకుండా పోయాడు.  నిఖిల్ కుటుంబ సభ్యులు  మూడు రోజులుగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.  ఇవాళ తెల్లవారుజామున కట్టుకొమ్మగూడెం వద్ద సాగర్ ఎడమ కాలువలో  నిఖిల్ మృతదేహం లభించింది. నిఖిల్ ను ఎవరు హత్య చేశారనే విషయమై పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

ఓ అమ్మాయితో నిఖిల్ మాట్లాడేవాడని తమకు తెలుసునని నిఖిల్ తల్లి మీడియాకు చెప్పారు. కానీ  తన కొడుకు హత్యకు అమ్మాయి కుటుంబ సభ్యులే కారణమని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తన సోదరుడు ఇటీవల కాలంలో టెన్షన్ గా ఉండేవాడని  నిఖిల్ సోదరి చెప్పారు. టెన్షన్ ఏమిటో  తమతో అతను చెప్పలేదన్నారు. తాను హైద్రాబాద్ లో ఉంటే అమ్మాయి  పోన్లు చేసి ఇబ్బంది పెట్టేది, ఇక్కడికి వస్తే మరోటెన్షన్ ఉందని చెప్పే వాడని ఆమె అన్నారు.  

Latest Videos

 హైద్రాబాద్ లో ఎల్ఎల్ బీ పూర్తి చేసిన నిఖిల్ దసరా పర్వదినం కోసం సూర్యాపేటకు వచ్చారు. ఈ నెల 9వ తేదీన రాత్రి స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా  పట్టణంలోని  హోటల్ లో గది అద్దెకు తీసుకొని పార్టీ చేసుకున్నారు.  అక్కడి నుండి నిఖిల్ ను అతనిస్నేహితులు   అతని బంధువుల ఇంటికి సమీపంలో రోడ్డుపై వదిలి వెళ్లారు. బంధువుల ఇంటి నుండి మరోసారి రోడ్డుపైకి వచ్చినట్టుగా పోలీసులు సీసీటీవీ దృశ్యాలను గుర్తించారు.  అదే రోజు రాత్రినుండి నిఖిల్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. ఇవాళ ఉదయం సాగర్ ఎడమ కాలువలో నిఖిల్ మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 నిఖిల్ ది పరువుహత్య అనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే  నిఖిల్ హత్యకు కారణాలపై పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.  ఇది పరువు హత్యనా, ఇతరత్రా కారణాలతో హత్య జరిగిందా అనే విషయం పోలీసుల విచారణలో తేలనుంది. 

click me!