పెట్టుబడులపేరుతో హవాలా రాకెట్, 10 మందిఅరెస్ట్: హైద్రాబాద్ సీపీ ఆనంద్

Published : Oct 12, 2022, 05:19 PM IST
పెట్టుబడులపేరుతో హవాలా రాకెట్, 10 మందిఅరెస్ట్: హైద్రాబాద్ సీపీ ఆనంద్

సారాంశం

పెట్టుబడుల పేరుతో హవాలా రాకెట్ నడిపిన 10 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టుగా  హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. 

హైదరాబాద్:  పెట్టుబడుల పేరుతో  హవాలా  రాకెట్ ను నడిపిన  10 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టుగా  హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం నాడు  తన కార్యాలయంలో  హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్  మీడియాతో మాట్లాడారు. తైవాన్ కు చెందిన చున్యూ,చైనాకు చెందిన జాక్  ఈ ముఠాలో  కీలక పాత్రధారులని  సీపీ చెప్పారు. పెట్టుబడుల పేరుతో  హవాలా రాకెట్ నడిపారన్నారు.  

 ఈ కేసులో  పుణెకు చెందిన వీరేందర్ సింగ్ ను అరెస్ట్ చేస్తే చైనా దేశానికి చెందిన జాక్ హస్తం బయటపడిందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.  ఈ మోసాన్ని ఈడీ లాంటి సంస్థలు కూడ గుర్తించలేవన్నారు.  ఈ  మోసంపై ఈడీ,డీఆర్ఐ అధికారులను దర్యాప్తు చేయాలని కోరుతామని సీవీ ఆనంద్  చెప్పారు.

 ఈ ముఠా మోసానికి ఎందరో గురయ్యారన్నారని తమ దర్యాప్తులో తేలిందని సీపీ వివరించారు. చైనా దేశస్తుడి ఆదేశాలతోనే తాము ఈ  మోసానికి పాల్పడినట్టుగా  పుణెకి చెందిన వీరేందర్ సింగ్  దర్యాప్తులో వెల్లడించారని సీపీ  చెప్పారు.

 నిందితులు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారన్నారు. ఎలాంటి రికార్డులు లేకుండానే  వర్చువల్  బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. దేశం నుండి  వందల కోట్లను చైనాకు తరలించినట్టుగా గుర్తించినట్టుగా సీపీ తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే