నవీన్ హత్య: శరీరభాగాలు దొరకకుండా హరిహరకృష్ణ ఏం చేశాడంటే?

By narsimha lode  |  First Published Mar 9, 2023, 11:11 AM IST

అబ్దుల్లాపూర్ మెట్  వద్ద  నవీన్ ను హత్య  చేసిన తర్వాత ఈ కేసు నుండి బయట పడేందుకు  హరిహరకృష్ణ  తీవ్రంగా  ప్రయత్నించినట్టుగా  పోలీసులు గుర్తించారు.  
 



హైదరాబాద్: నవీన్ ను  హత్య  చేసిన తర్వాత  లవర్ ను  నాలుగు సార్లు  కలిశాడు  హరిహరకృష్ణ.  నవీన్ ను హత్య  చేసేందుకు  కొనుగోలు  చేసిన  గ్లౌజులు , కత్తిని  కూడా  లవర్ కు  చూపాడు  హరిహరకృష్ణ. 

ఈ నెల  6వ తేదీన  హరిహరకృష్ణ లవర్ ను , స్నేహితుడు  హసన్ ను  పోలీసులు  అరెస్ట్  చేశారు.  నవీన్ హత్య  కేసుకు సంబంధించిన  కన్ఫెన్షన్ స్టేట్ మెంట్  లో  హరిహరకృష్ణ, హసన్,  హరిహరకృష్ణ లవర్  విచారణలో చెప్పిన  అంశాలను  పోలీసులు  పొందుపర్చారు. 

Latest Videos

హరిహరకృష్ణ  తాను  హైద్రాబాద్ లో  ఉండే  నివాసానికి  కూడా  ఒక్కసారి తీసుకెళ్లినట్టుగా ఆ యువతి  పోలీసుల విచారణలో  ఒప్పుకుంది.  ఈ సమయంలో  నవీన్ ను  హత్య చేసేందుకు కొనుగోలు  చేసిన  కత్తి,  గ్లౌజులను  హరిహరకృష్ణ ఆమెకు  చూపాడు.  అయితే  ఆ సమయంలో  ఇదంతా  ఉట్టిదేనని  ఆమె  భావించినట్టుగా  ఈ స్టేట్  మెంట్  చెప్పారు. గత  నెల  17వ తేదీన  అబ్దుల్లాపూర్ మెట్  వద్ద నవీన్ ను హత్య  చేసిన తర్వాత  తన  లవర్ కు , స్నేహితుడికి  హరిహరకృష్ణ సమాచారం  ఇచ్చాడు.

ఫిబ్రవరి  17వ తేదీన నవీన్ ను హత్య  చేసిన  తర్వాత బ్రహ్మణపల్లిలోని  తన స్నేహితుడు  హసన్  ఇంటికి వెళ్లాడు  హరిహరకృష్ణ.  హసన్  ఇంటికి వెళ్లే సమయంలో నవీన్ శరీరభాగాలను  బ్యాగులో తీసుకెళ్లాడు.  ఈ  శరీరబాగాలను  హసన్ ఇంట్లోని గోనెసంచిలో  వేసుకుని  బ్రహ్మణపల్లి శివారులో  వేశారు హసన్,  హరిహరకృష్ణ.

అయితే బ్రహ్మణపల్లి  శివారులో  ఈ శరీరభాగాలు లభ్యమైతే తన పేరు బయటకు వస్తుందని హసన్ భావించాడు.  ఈ విషయాన్ని  హరిహరకృష్ణకు  చెప్పాడు.దీంతో బ్రహ్మణపల్లిలో  పారేసిన గోనెసంచిని తీసుకెళ్లారు. నవీన్ ను హత్య  చేసిన ప్రాంతానికి తీసుకెళ్లి   ఈ శరీరభాగాలను  దగ్ధం  చేశారు. ఈ ఘటనలో  హరిహరకృష్ణకు హసన్  సహకరించాడు.  మరోవైపు  ఈ సమయంలో  అదే ప్రాంతంలో  హరిహరకృష్ణ లవర్ ఉంది.  సంఘటన స్థలానికి  దూరంగా  ఆమెను వదిలేసి  వీరిద్దరూ  నవీన్ డెడ్ బాడీ వద్దకు  వెళ్లి శరీరభాగాలను  దగ్దం  చేశారని  ఈ స్టేట్ మెం్  చెబుతుందని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్   ఎన్టీవీ కథనం  ప్రసారం  చేసింది. నవీన్ ను హత్య  చేసిన తర్వాత  మూడుసార్లు  వనస్థలిపురం ప్రాంతంలో  హరిహరకృష్ణ, అతని  లవర్  కలుసుకున్నారు. మరో దఫా  హస్తినాపురంలోని  యువతి  ఇంటి సమీపంలో  కలుసుకున్నారు. 

also read:నవీన్ హత్య కేసు: 9 నెలల ప్రేమ కోసం 'ఫ్రెండ్‌ను చంపిన హరిహరకృష్ణ

ఇంటర్ చదువుకునే రోజుల్లోనే  నవీన్ , తన మధ్య  ప్రేమ ఉందని  ఆమె  పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. తాను , నవీన్ గొడవపడితే  హరిహరకృష్ణ సర్ధిచెప్పేవాడని  పోలీసులకు తెలిపారు. అయితే  కొన్ని కారణాలతో  నవీన్ కు తనకు మధ్య గ్యాప్  ఏర్పడిందని  ఆమె విచారణలో చెప్పారు. నవీన్ హత్య తర్వాత   హరిహరకృష్ణ మాటలను తాను  నమ్మినట్టుగా  తెలిపారు.  పోలీసులకు  దొరకకుండా  తప్పించుకుంటానని  హరిహరకృష్ణ  ధీమాగా  ఉండేవాడని  ఆ యువతి  పోలీసులకు  ఇచ్చిన స్టేట్ మెంట్ లో  పేర్కొన్నారని  ఈ కథనం తెలిపింది. 

మరో వైపు  ఆ యువతి  బంధువు  లాయర్.  ఈ హత్య  కేసు విషయమై   అతనితో  హరిహరకృష్ణ  చర్చించాడు. అయితే  అతను పోలీసులకు  లొంగిపోవాలని  సూచించాడు.న్యాయవాది సూచన మేరకు  హరిహరకృష్ణ  పోలీసులకు లొంగిపోయాడు.


 


 

click me!