తెలంగాణ సచివాలయం కూల్చివేత: పరిశీలించిన ఎన్జీటీ బృందం

By narsimha lodeFirst Published Sep 10, 2020, 3:04 PM IST
Highlights

తెలంగాణ సచివాలయం కూల్చివేసిన ప్రదేశాన్ని గురువారంనాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రతినిధులు పరిశీలించారు. సచివాలయం పరిసరాలను ఎన్జీటీ సభ్యులు పరిశీలించారు.
 

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేసిన ప్రదేశాన్ని గురువారంనాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రతినిధులు పరిశీలించారు. సచివాలయం పరిసరాలను ఎన్జీటీ సభ్యులు పరిశీలించారు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రతినిధులతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 2001 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా హుస్సేన్ సాగర్ కు కిలోమీటరు దూరం వరకు ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

also read:తెలంగాణ సచివాలయం కూల్చివేత: కాలుష్యంపై అధ్యయనానికి ఎన్జీటీ కమిటీ

తెలంగాణ సచివాలయం కూల్చివేత పర్యావరణ నిబంధనలకు విరుద్దమని ఆరోపిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి  ఈ ఏడాది జూలై 16న పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ పై విచారణ చేసిన ఎన్జీటీ ఈ ఏడాది జూలై 20వ తేదీన కీలక ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేతతో ఏర్పడే వ్యర్థాలు, వాయు కాలుష్యంపై అధ్యయనం చేసేందుకు కమిటిని ఏర్పాటు చేసింది 

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి జూలై 16వ తేదీన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచీలో పిటిషన్ దాఖలు చేశాడు.  సచివాలయ కూల్చివేత వల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాలు, వాయు కాలుష్యంపై అధ్యయనం చేసేందుకు జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలో ద్విసభ్య బెంచ్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైద్రాబాద్ కు చెందిన నిపుణులతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌జీటీ ఆదేశించింది. 
 

click me!