అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్: జీహెచ్ఎంసీపై బీజేపీ కన్ను

By narsimha lodeFirst Published Sep 10, 2020, 2:46 PM IST
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికలపై కమలదళం కన్నేసింది. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుతపుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి నుండే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని కమలం పార్టీ పావులు కదుపుతోంది.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలపై కమలదళం కన్నేసింది. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుతపుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి నుండే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని కమలం పార్టీ పావులు కదుపుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు గాను ఇటీవలనే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ జాతీయ నాయకత్వం నియమించింది.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు  సంజయ్ ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యవర్గంపై బీజేపీ నాయకులు పెదవి విరించారు. పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగానే  బండి సంజయ్  తీరుపై విమర్శలు చేశారు.

జీహెచ్ఎంసీతో పాటు, వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలు బీజేపీకి సవాల్ విసురుతున్నాయి. ఈ రెండు చోట్ల త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ప్రధానంగా జీహెచ్ఎంసీ  ఎన్నికలపై కన్నేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను  సాధించేందుకు కమల దళం ప్లాన్ చేస్తోంది. 

టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంలో  సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ప్రస్తుతం ఉన్న స్థానాల కంటే ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉందని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందన్నారు.

బీజేపీ ప్రధానంగా జీహెచ్ఎంసీతో పాటు వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలపై  కేంద్రీకరించారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీలు పొత్తు పెట్టుకొన్నాయి.ఆ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క స్థానం,. బీజేపీకి 3 సీట్లు దక్కాయి.

అయితే ఈ దఫా జీహెచ్ఎంసీలో ఎక్కువ స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తొంది. శాసనసభ ఎన్నికలకు జీహెచ్ఎంసీ ఎన్నికలు సెమీ ఫైనల్ గా బీజేపీ భావిస్తోంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వరంగల్ నుండి బీజేపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొంది. వరంగల్ లో కార్పోరేషన్ ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలని కమలం భావిస్తోంది. ఇటీవల  కాలంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ బీజేపీ శ్రేణులతో సమావేశం నిర్వహించిన సమయంలో స్థానికంగా టీఆర్ఎస్ నేతలపై చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య ఘర్షణలకు దారి తీసిన విషయం తెలిసిందే.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలతో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం కావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ నేతలు వ్యూహా రచన చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడ జీహెచ్ఎంసీ కేంద్రీకరించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులు... .జీహెచ్ఎంసీలో చేపట్టిన అభివృద్ధి విషయాలపై కూడ బీజేపీ ప్రధానంగా ప్రచారం చేయనుంది.
 

click me!