హైదరాబాద్‌లో దారుణం : నవ దంపతులపై అమ్మాయి బంధువుల దాడి, యువకుడి మృతి

Siva Kodati |  
Published : May 04, 2022, 10:17 PM IST
హైదరాబాద్‌లో దారుణం : నవ దంపతులపై అమ్మాయి బంధువుల దాడి, యువకుడి మృతి

సారాంశం

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో నవదంపతులపై అమ్మాయి తరపు బంధువులు దాడి చేశారు. యువకుడిని ఐరన్ రాడ్‌తో కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సరూర్ నగర్ చెరువు కట్ట వద్ద ఈ ఘటన జరిగింది. 

హైదరాబాద్ (hyderabad) సరూర్ నగర్‌లో (saroor nagar) దారుణం జరిగింది. బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి చేశారు అమ్మాయి తరపు బంధువులు. అబ్బాయిపై ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొన్ని  రోజుల క్రితమే ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. సరూర్‌నగర్‌లోని  చెరువు కట్ట దగ్గర వీరిపై దాడి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?