ఓయూలో రాహుల్ టూర్ : జోక్యం చేసుకోలేం, తుది నిర్ణయం వీసీదే.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Siva Kodati |  
Published : May 04, 2022, 08:48 PM IST
ఓయూలో రాహుల్ టూర్ : జోక్యం చేసుకోలేం, తుది నిర్ణయం వీసీదే.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

సారాంశం

ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటను ఎలాగైనా ఏర్పాటు చేయాలని భావిస్తోన్న టీ.కాంగ్రెస్ నేతలకు హైకోర్టు షాకిచ్చింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ,  పిటిషన్ కొట్టివేసింది.   

ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. కింద బెంచ్ తీర్పునే సమర్ధించింది హైకోర్ట్. రెండు రోజుల క్రితం పిటిషన్‌ పరిశీలించాలని ఓయూ వీసీని న్యాయస్థానం ఆదేశించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు  స్పష్టం చేసింది. నిర్ణయాన్ని ఓయూ వీసీకి వదిలేసింది ధర్మాసనం. 

కాగా.. కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) ఓయూ పర్యటనకు (osmania university) తెలంగాణ హైకోర్టు (telangana high court) తొలుత అనుమతి మంజూరు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. రాహుల్ సభకు అనుమతించాలని ఓయూ వీసీని హైకోర్టు ఆదేశించింది. విద్యార్ధులతో రాహుల్ ముఖాముఖికి న్యాయస్థానం అనుమతించింది. 150 మందితో మాత్రమే అనుమతించాలని వీసీని ఆదేశించింది. 

అంతకుముందు ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది న్యాయస్థానం. విద్యార్ధుల సమస్యలు తెలుసుకునేందుకే.. రాహుల్ వస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. గతంలో వివిధ పార్టీలు చాలా సమావేశాలు పెట్టాయని.. ఇప్పుడు ఎందుకు అనుమతివ్వడం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సింగిల్ బెంచ్ ఆదేశాలతో మళ్లీ దరఖాస్తు చేసుకున్నామని.. అయినా అనుమతి నిరాకరించారని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. 

ఓయూలో రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌ర్సిటీ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ అనుమ‌తి నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే. దీంతో టీపీసీసీ నేత‌లు నేరుగా తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. టీపీసీసీ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు సింగిల్ జ‌డ్జి అందుకు నిరాక‌రించారు. అయినప్పటికీత‌న న్యాయ‌పోరాటాన్ని కొన‌సాగించిన టీపీసీసీ బుధ‌వారం మ‌రోమారు హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు ధ‌ర్మాస‌నం ఓయూలో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి మంజూరు చేస్తూ బుధవారం కీల‌క తీర్పు నిచ్చింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu