సరూర్‌నగర్‌లో తల్లి హత్య కేసులో ట్విస్ట్ : అమ్మాయిల కోసం స్కెచ్ గీసిన శివ... సాయిని పావుని చేసి

Siva Kodati |  
Published : May 13, 2022, 06:01 PM ISTUpdated : May 13, 2022, 06:06 PM IST
సరూర్‌నగర్‌లో తల్లి హత్య కేసులో ట్విస్ట్ : అమ్మాయిల కోసం స్కెచ్ గీసిన శివ... సాయిని పావుని చేసి

సారాంశం

సరూర్‌నగర్‌ తల్లి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అమ్మాయిలకు ఖర్చు పెట్టేందుకు డబ్బు కోసం భూదేవిని హత్య చేయాలని శివ స్కెచ్ గీసినట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా మానసిక స్థితి సరిగా లేని సాయిని పురిగొల్పినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది

సరూర్‌నగర్ (saroornagar) తల్లి హత్య కేసులో (mother murder case) మరో కొత్త కోణం వెలుగు చూసింది. స్నేహితుడు శివతో కలిసి తల్లిని చంపాడు దత్తపుత్రుడు సాయి (sai) . అయితే నలుగురు  కలిసి భూదేవిని చంపినట్లు పోలీసులు గుర్తించారు. మానసిక స్ధితి సరిగాలేని సాయిని హత్య చేసేలా శివ పురిగొల్పినట్లుగా తెలుస్తోంది. అమ్మాయిల కోసమే భూదేవిని శివ చంపినట్లుగా సమాచారం. అమ్మాయిలకు డబ్బులు ఖర్చు పెట్టడానికి.. హత్య, దోపిడీకి పాల్పడ్డాడు. హత్య విషయం బయటపడుతుందని సాయిని కూడా కడతేర్చాడు శివ. 

కాగా..  భూదేవి (58) హత్య ఘటనలో నిందితుడైన దత్తపుత్రుడు సాయితేజ (27)ను అతడి స్నేహితుడు శివ దారుణంగా హత్య చేశాడు. అమ్రాబాద్ అడవుల్లో రెండురోజుల క్రితం చంపేయగా, పోలీసులకు భయపడిన శివ గురువారం సరూర్ నగర్ పోలీస్ ఠాణాలో లొంగిపోయాడు. అనంతరం సరూర్ నగర్ పోలీసులు అక్కడి అటవీశాఖ, పోలీసుల సహాయంతో మృతదేహాన్ని గుర్తించారు. ఐదురోజుల క్రితం భూదేవిని హత్య చేసిన అనంతరం సాయితేజ, శివలు శ్రీశైలానికి పారిపోయారు. అక్కడికి వెళ్లాక పోలీసులు గుర్తించకుండా సాయితేజ గుండు కొట్టించుకున్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. 

సాయితేజ వెంట ఉన్న బ్యాగులో 35 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అమ్రాబాద్ ఎస్సై సద్దాం హుసేన్ వివరాల ప్రకారం.. శివ, సాయితేజ ఈ నెల 10న శ్రీశైలం వెళ్లారని, తిరుగు ప్రయాణంలో అమ్రాబాద్ మండలం మల్లెతీర్థం జలపాతంకు వెళ్లారని, దూరంగా ఉన్న ఓ మడుగు వద్దకు వెళ్లాక సాయితేజను శివ బండరాయితో తలమీద కొట్టి చంపేశాడు. అనంతరం బ్యాగులో రాళ్లు నింపి నడుముకు కట్టి మడుగులో పారేశారని వివరించారు. మృతదేహాన్ని వెలికితీసి అచ్చంపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అజ్ఞాతంలో ఇతర నిందితులు...
దిల్ సుఖ్ నగర్ న్యూ గడ్బి అన్నారం కాలనీకి చెందిన జంగయ్య యాదవ్, భూదేవి (58) దంపతులకు నిందితుడైన సాయితేజ దత్తపుత్రుడు..అయితే, అతని మానసిక ప్రవర్తన సరిగా లేకపోవడంతో స్నేహితులకు వీరి ఆస్తిపై కన్నుపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు స్నేహితులు నర్సింహ, సాయిగౌడ్, చింటూ, శివలు సాయితేజను పావుగా వాడుకొని ఇంట్లో ఉన్న పెంపుడు తల్లిని చంపి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, నగదు తీసుకువచ్చే విధంగా వారం రోజుల ముందు నుంచే పక్కా ప్రణాళికను రూపొందించారు.

అనుకున్నట్లుగానే భూదేవిని సాయితేజ, శివలు దిండుతో నోరు, ముక్కు మూయగా నర్సింహ చేతులు పెట్టుకుని చింటూ, సాయిగౌడ్ లో కాళ్లను గట్టిగా పట్టుకొని చనిపోయిందని నిర్థారించుకుని బంగారం, నగదుతో పరారయ్యారు. సొమ్ముతో ఆశతో ఆ నలుగురు కలిసి సాయితేజను చంపేశారు. గురువారం రాత్రి శివను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతని నుంచి రూ. లక్ష 22 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్