బండి సంజయ్ పై పరువు నష్టం దావా: లీగల్ నోటీసు పంపిన కేటీఆర్

By narsimha lodeFirst Published May 13, 2022, 4:47 PM IST
Highlights


బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తెలంగాణ  మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశాడు.48 గంటల్లో కేటీఆర్ కు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

హైదరాబాద్: BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay పై తెలంగాణ మంత్రి KTR  పరువు నష్టం దావా వేశాడు. ఈ మేరకు న్యాయవాది ద్వారా బండి సంజయ్ కు కేటీఆర్ Notice పంపారు.  తన నిర్వాకం వల్లే రాస్ట్రంలో 27 మంది ఇంటర్ విద్యార్ధులు మరణించారని బండి సంజయ్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.

also read:ఆధారాలుంటే బయట పెట్టు, లేకపోతే చట్టపరమైన చర్యలు: బండి సంజయ్ కి కేటీఆర్ వార్నింగ్

ట్టిట్టర్ వేదికగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను 48 గంటల్లోపుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ తరపు న్యాయవాది బండి సంజయ్ ను కోరారు. లేకపోతే సివిల్ క్రిమినల్ చట్టాల ప్రకారంగా పరిహారం చెల్లించాలని ఆ నోటీసులో కోరారు.

 

BS Kumar, if you don’t stop this ludicrous, baseless & irresponsible allegations, I’ll be constrained to take legal action

If you have an iota of evidence to prove what you allege, please put it in public domain or else apologise publicly for this BS rhetoric https://t.co/YaskNVfJqj

— KTR (@KTRTRS)


 కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది విద్యార్ధులు మరణించారని ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఆరోపించారు.  ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్ధులు చనిపోతే కేసీఆర్  సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదని కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వీడియోను బండి సంజయ్ పోస్టు చేశాడు. ప్రజా సంగ్రామ యాత్రలో గ్రామస్థులతో మాట్లాడే సమయంలో ఈ ఆరోపణలు చేశారు బండి సంజయ్. 

 అయితే  ఇంటర్  విద్యార్ధుల మృతికి తాను ఎలా కారణమయ్యానో  బండి సంజయ్ ఆధారాలు చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.ఈ ఆరోపణలపై చట్ట పరమైన చర్యలు తీసుకొంటానని కూడా కేటీఆర్ వార్నింగ్ ఈ నెల  14న  వార్నింగ్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగానే కేటీఆర్ బండి సంజయ్ కి వార్నింగ్ ఇచ్చారు. తనపై చేసిన  ఆరోపణలకు సంబంధించి ఆధారాలుంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని కోరారు. లేకపోతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా కేటీఆర్ పేర్కొన్నారు.
 

click me!