Telangana Crime : పదో తరగతి బాలికపై యువకుడు అత్యాచారం... గర్భందాల్చిన మైనర్

Arun Kumar P   | Asianet News
Published : May 13, 2022, 04:38 PM ISTUpdated : May 13, 2022, 04:42 PM IST
Telangana Crime : పదో తరగతి బాలికపై యువకుడు అత్యాచారం... గర్భందాల్చిన మైనర్

సారాంశం

పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతూ గర్భవతిని చేసాడో యువకుడు. ఈ దారుణం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.   

సిద్దిపేట: అభం శుభం తెలియని మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ మాయమాటలతో లోబర్చుకున్నాడో యువకుడు. పూర్తిగా నమ్మిన బాలికపై గత ఏడాదికాలంగా అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె  గర్భందాల్చింది. ఈ అమానుష ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగుచూసింది. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన ఓ బాలిక (15) పదోతరగతి చదువుతోంది. ఈ బాలిక ఇంటిపక్కనే ఇంటర్మీడియట్ వరకు చదివి ప్రస్తుతం ఖాళీగా వుంటున్నాడో యువకుడు. జులాయిగా తిరుగుతున్న ఇతడి కన్న ఇంటిపక్కన బాలికపై పడింది. స్కూల్ కి వెళ్లే సమయంలో, ఇంట్లోంచి బయటకు వచ్చినపుడు బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. అతడి మాయమాటలు బాలిక నమ్మి మోసపోయింది. 

బాలిక తనపై పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత మరింత మభ్యపెట్టి శారీరకంగా కూడా దగ్గరయ్యాడు. ఇలా గత ఏడాది కాలంగా బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అతడిని గుడ్డిగా నమ్మిన బాలిక ఈ విషయం  ఎవరికీ చెప్పలేదు. 

అయితే ఇటీవల బాలిక కడుపునొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించి గర్భవతిగా తేల్చారు. దీంతో బాలికను తల్లిదండ్రులు నిలదీయగా తనపై ఏడాదిగా ఎదురింటి యువకుడు చేస్తున్న అఘాయిత్యం గురించి బయటపెట్టింది. 

తన కూతురిని మాయమాటలతో నమ్మించి గర్భవతిని చేసిన యువకుడిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో బేగంపేట పోలీసులు యువకుడిపై పోక్సో చట్టంతో పాటు వివిద సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరారీలో వున్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇదిలావుంటే ఇలాంటి అమానుషమే వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక (15)పై అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ (19) కన్నేసాడు. యువతిని ఎలాగయినా అనుభవించాలని దుర్భుద్దితో వున్న అతడు సరయిన సమయం కోసం ఎదురుచూసాడు. ఈ  క్రమంలోనే ఇంటిబయట ఒంటరిగా వున్న బాలికను గమనించిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. 

యువతి అరవకుండా చేతితో నోరు మూసి బాలికను బలవంతంగా పక్కనే వున్న పొలాల్లోకి ఎత్తుకెళ్లాడు. అతడి నుండి తప్పించుకోడానికి బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో తనతో తెచ్చుకున్న మద్యాన్ని బాలికతో బలవంతంగా తాగించి మత్తులోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలిక అరవకుండా నోటిని అదిమిపట్టి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.    

అయితే బాలికను ప్రవీణ్ లాక్కెళుతుండగా గమనించిన చాకలి రవి వారిని అనుసరించాడు. కామాంధుడి నుండి బాలికను రక్షించాల్సింది పోయి తాను కూడా దారుణానికి ఒడిగట్టాడు. అప్పటికే అత్యాచారానికి గురయి అపస్మారక స్థితిలో వున్న బాలికపై రవి కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా ఇద్దరు నీచులు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో బాలిక సోదరుడు వెంటనే పరిగి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్