ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ట్విస్ట్.. రోహిత్ రెడ్డి ఫిర్యాదు, నిందితులపై మరో కేసు

Siva Kodati |  
Published : Nov 08, 2022, 07:28 PM ISTUpdated : Nov 08, 2022, 07:36 PM IST
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ట్విస్ట్.. రోహిత్ రెడ్డి ఫిర్యాదు, నిందితులపై మరో కేసు

సారాంశం

మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముగ్గురు నిందితులపై మరో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ మేరకు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌పై కేసు నమోదు చేశారు. 

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముగ్గురు నిందితులపై మరో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ మేరకు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌పై కేసు నమోదు చేశారు. నకిలీ గుర్తింపు పత్రాలపై తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తుపై వున్న స్టేను ఎత్తేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పిన కొద్దిగంటల్లో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు ముందుకు వెళ్లొచ్చని న్యాయస్థానం ఆదేశించింది. ఇలాంటి కేసులోలో ఎక్కువ రోజులు దర్యాప్తును నిలిపివేయడం మంచిది కాదని కోర్టు అభిప్రాయపడింది. 

ALso REad:మొయినాబాద్ ఫాంహౌస్ కేసు... నిందితులకు షాకిచ్చిన హైకోర్ట్, దర్యాప్తుపై స్టే ఎత్తివేత

కాగా... గత నెల 26న మొయినాబాద్ ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు చేస్తున్నారనే ఆరోపణలతో రామచంద్రభారతి ,సింహయాజీ, నందకుమార్ లను మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిర్యాదు మేరకు  పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్  చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యేరేగా కాంతారావు ,తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ఈ ముగ్గురు నిందితులు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని టీఆర్ఎస్ ఆరోపించింది. దీని వెనుక బీజేపీ ఉందని కూడ గులాబీ పార్టీ  తెలిపింది. అయితే ఈ  ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ విషయమై ఆడియో, వీడియోలను  కూడ టీఆర్ఎస్ విడుదల చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu