దేశవ్యాప్తంగా విడిచిన చంద్ర గ్రహణం.. భక్తుల పుణ్య స్నానాలు, శుద్ధి తర్వాత తెరచుకోనున్న ఆలయాలు

By Siva KodatiFirst Published Nov 8, 2022, 6:59 PM IST
Highlights

దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం విడిచింది. తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. గౌహతిలో అత్యధికంగా గంటా 43 నిమిషాల సేపు గ్రహణం కనిపించింది. దీంతో గ్రహణం విడుపు స్నానాలు చేస్తున్నారు ప్రజలు. 

దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం విడిచింది. తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. గౌహతిలో అత్యధికంగా గంటా 43 నిమిషాల సేపు గ్రహణం కనిపించింది. దీంతో గ్రహణం విడుపు స్నానాలు చేస్తున్నారు ప్రజలు. దీంతో నదులు, చెరువులు, సరస్సులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 

ALso REad:నేడే చంద్రగ్రహణం.... ఈ రాశుల వారిపై ప్రభావం...!

కాగా.. ఈ గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేశారు. మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేశారు. ఈ కారణంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి.. శుద్ధి చేశాక సర్వదర్శనాలను ప్రారంభిస్తారు.

ఇక సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మూతపడింది. ఉదయం ఆలయంలో నిత్య కైంకర్యాలు పూర్తి చేసి 8.15 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేయనున్నారు. రేపు ఉదయం 9 నుంచి  స్వామి వారి ఉభయ దర్శనాలతో పాటు, నిత్య కైంకర్యాలు యధావిధిగా కొనసాగుతాయని ఆలయ ప్రదాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు తెలిపారు. 

చంద్రగ్రహణం కారణంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని మూసివేశారు. ఆలయం వద్ద ఉన్న ఉపాలయాలను కూడా మూసేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామివారి ఆలయ ద్వార బంధనం కొనసాగనుంది. ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేశారు. రాత్రి 7 గంటలకు ఆలయ సంప్రోక్షణ, స్వామివారికి అభిషేకం, మంగలహారతి, నివేదన నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ తెలిపారు. 
 

click me!