నా భార్యపై బాలుడు అత్యాచారం చేశాడు, అందుకే..: మైలార్‌దేవ్‌పల్లి ఘటనలో నిందితుడు

Published : Aug 29, 2023, 10:05 AM IST
నా భార్యపై బాలుడు అత్యాచారం చేశాడు, అందుకే..: మైలార్‌దేవ్‌పల్లి ఘటనలో నిందితుడు

సారాంశం

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో మైనర్ బాలుడి హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. బాలుడిని పంకజ్ పాశ్వాన్ ‌అనే వ్యక్తి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో మైనర్ బాలుడి హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. బాలుడిని పంకజ్ పాశ్వాన్ ‌అనే వ్యక్తి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే పంకజ్ పాశ్వాన్‌ను అరెస్ట్ చేశారు. అయితే తన భార్యను బాలుడు కత్తితో బెదిరించి, అత్యాచారానికి పాల్పడటంతోనే అతని హత్య చేసినట్టుగా నిందితుడు పంకజ్‌ పాశ్వాన్ ఆరోపించారు.  వివరాలు.. బాలుడు రాజా పాశ్వాన్ (17)కొన్ని నెలల క్రితం బీహార్ నుంచి హైదరాబాద్‌‌కు వలస వచ్చాడు. మైలార్ దేవ్ పల్లి లక్ష్మీ గూడ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు. కాటేదాన్ పారిశ్రామిక వాడలోని స్క్రాప్ కంపెనీలో పని చేస్తున్నాడు.  

ఈ నెల 26  సాయంత్రం కంపెనీ దగ్గరకు వెళ్తున్నానని ఇంట్లో నుంచి వెళ్లిన రాజా పాశ్వాన్ తిరిగి ఇంటికి రాలేదు.  దీంతో రాజా పాశ్వాన్ తల్లిదండ్రులు కంపెనీ వద్ద విచారించగా అక్కడకు రాలేదని తెలిపారు. మరోవైపు పలు ప్రాంతాల్లో రాజా పాశ్వాన్ గురించి గాలింపు చేపట్టినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు.  అయితే ఆదివారం లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీలోని నిర్మానుష్య ప్రదేశంలో రాజా పాశ్వాన్ మృతదేహాం లభించింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఈ క్రమంలోనే రాజా పాశ్వాన్‌ను హత్య చేసింది పంకజ్‌గా గుర్తించారు. రాజాను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన పంకజ్.. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్టుగా తేల్చారు. ఈ కేసుకు సంబంధించి పంకజ్‌ను అరెస్ట్ చేశారు. అయితే  తన భార్యను బాలుడు కత్తితో బెదిరించి, అత్యాచారానికి పాల్పడటంతోనే అతని హత్య చేసినట్టుగా నిందితుడు పంకజ్‌ పోలీసులకు తెలిపాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?