
మంచిర్యాల : మంచిర్యాలలో ఓ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఉద్రిక్తతలకు దారితీసింది. పురుటి నొప్పులతో లైలా అనే గర్భిణి ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో క్లాత్ మర్చిపోయారు. ఇంటికి వెళ్లిన తరువాత లైలాకు మూత్రవిసర్జనలో ఇబ్బంది, కడుపులో నొప్పితో అస్వస్థతకు గురి కావడంతో వేరే ఆస్పత్రికి వెళ్లగా విషయం వెలుుగు చూసింది. దీంతో లైలా కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.