కానిస్టేబుల్ సంధ్యారాణి కేసులో ట్విస్ట్: భర్తే అసలు దోషి .. భార్యపై దుష్ప్రచారం చేసిన చరణ్

Siva Kodati |  
Published : May 19, 2021, 06:57 PM IST
కానిస్టేబుల్ సంధ్యారాణి కేసులో ట్విస్ట్: భర్తే అసలు దోషి .. భార్యపై దుష్ప్రచారం చేసిన చరణ్

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఏఆర్ కానిస్టేబుల్ సంధ్యా రాణి కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుని తనను మోసం చేసినట్లు భర్త చరణ్ తేజ్‌పై సంధ్యా రాణి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. కులం పేరుతో దూషించి వేధింపులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేసింది.

దీంతో చరణ్ తేజ్‌పై ఐపీసీ సెక్షణ్ 498ఏ, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు.. అసలు వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. సంధ్యా రాణిపై భర్త చరణ్ తేజ దుష్ప్రచారం చేసినట్లు విచారణలో తేలింది. 

కాగా, సంధ్యా రాణి తనను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ షాబాద్ మండలం హైతబాద్‌కు చెందిన చరణ్ తేజ్ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
పెళ్లి చేసుకోకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించినట్లు బాధితుడు చెబుతున్నాడు.

Also Read:లేడీ కానిస్టేబుల్ హానీట్రాప్: ముగ్గురితో పెళ్లి, ఒక భర్త ఆత్మహత్య, ఇద్దరికి విడాకులు

కానిస్టేబుల్ సంధ్యా రాణి నుంచి తనను రక్షించాల్సిందిగా శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తల్లిదండ్రులను కలవడానికి అనుమతించడం లేదని అతను చెప్పాడు. తనను మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేస్తోందని అతను ఫిర్యాదు చేశాడు.

గత వివాహాలు విషయం బయటపడకుండా తనను పెళ్లి చేసుకున్నట్లు చరణ్‌ చెబుతున్నాడు. ఒంటరిగా ఉన్న అబ్భాయిలను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటుందని బాధితుడు ఫిర్యాదులో పొందుపరిచాడు. సంధ్య రాణి బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని చరణ్ కోరాడు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!