ఈటెలకు షాక్ : ఎన్ని డబ్బులు ఇచ్చారో చెప్పాలన్న బండ శ్రీనివాస్..

Published : May 19, 2021, 04:04 PM IST
ఈటెలకు షాక్ : ఎన్ని డబ్బులు ఇచ్చారో చెప్పాలన్న బండ శ్రీనివాస్..

సారాంశం

హుజురాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అత్యంత సన్నిహితునిగా ముద్రపడ్డ బండ శ్రీనివాస్ షాకిచ్చారు. టీఆర్ఎస్ రాష్ట్ర బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండ శ్రీనివాస్ బుధవారం హుజురాబాద్‎లో మీడియాతో మాట్లాడుతూ… ప్రలోభాలకు గురై అమ్ముడు పోయే బిడ్డలం మాత్రం తాము కాదని స్పష్టం చేశారు. 

ఇంత కాలం మీతో కలిసి పనిచేసిన మాకు ఎన్ని డబ్బులు ఇచ్చారో వివరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో మీతో పాటు జైలుకు వచ్చిన తాము అభివృద్దితో పాటు అన్నింటా  కలిసి పనిచేశాం.. కానీ ఏమైనా ఆశించామా అని ప్రశ్నించారు. ఈటల పార్టీ కోసం ఖర్చు పెట్టాడేమో కానీ, మా వ్యక్తిగత అవసరాల కోసం ఎప్పుడూ డబ్బులు ఇవ్వలేదన్నారు. 

అనంతరం మునిసిపల్ చైర్ పర్సన్ గందె రాధిక మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకుల టీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంటే ఈ పార్టీలోంచి తాము బయటకు వెల్లడం ఏంటన్నారు. ప్రలోభాలకు గురవుతున్నామని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాము అలాంటి నాయకులం కాదని స్పష్టం చేశారు
 
PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?