తెలంగాణ కొత్త జిల్లాల్లో కొత్త చిచ్చు

Published : Jul 29, 2017, 11:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
తెలంగాణ కొత్త జిల్లాల్లో కొత్త చిచ్చు

సారాంశం

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం కోసం పరకాల బంద్ తమకే జిల్లా కేంద్రం కావాలంటున్న నర్సంపేట కలెక్టరేట్ల కోసం కొత్త జిల్లాల్లో ఊపందుకుంటున్న డిమాండ్లు  

తెలంగాణలో కొత్త జిల్లాల చిచ్చు ఇంకా చల్లారలేదు. పైపెచ్చు కొత్త రూపు సంతరించుకున్నది. పది జిల్లాల తెలంగాణను 31 ముక్కుల చేసింది తెలంగాణ సర్కారు. అడిగనోడికి, అడగనోడికి కూడా జిల్లాలు ఇచ్చింది సర్కారు. దీంతో కొద్దిగ గట్టి పట్టు పడితే మనకెందుకు జిల్లా రాదు అనుకుంటన్నారు ప్రజాప్రతినిధులు, నాయకులు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త జిల్లాల చిచ్చు ఇంకా చల్లారిన  దాఖలాలు లేవు. వరంగల్ రూరల్ జిల్లాలో తాజాగా కొత్త వివాదం రాజుకున్నది.

చైతన్యానికి మారు పేరు వరంగల్ జిల్లా. అందుకేనేమో ఆ జిల్లా ఎక్కువ ముక్కలైంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలతోపాటు జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలుగా ఐదు ముక్కలైంది. వరంగల్ అర్బన్ కు పరేషాన్ లేదు కానీ వరంగల్ రూరల్ పంచాయతీ షురూ అయింది. ఆ జిల్లలో నర్సంపేట, పరకాల నియోజకవర్గాలు కలిసిఉన్నాయి. దీంతో తమ ప్రాంతంలో కలెక్టరేట్ నెలకొల్పాలంటే... తమ ప్రాంతంలోనే కలెక్టరేట్ కావాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి.

దీంతో గత శనివారం, ఈ శనివారం పరకాల పట్టణంలో బంద్ నిర్వహించారు.  తమ పట్టణంలోనే జిల్లా కేంద్రం నెలకొల్పాలని, కలెక్టరేట్ ఇక్కడే నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పట్టణంలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. పరకాలకు కలెక్టరేట్ నిర్మించాలని అఖిలపక్షం నాయకులు,విద్యార్థి సంఘాలు బంధుకు పిలుపు ఇచ్చాయి.

మొత్తానికి జిల్లాల చిచ్చు గత ఏడాది దసరాతోనే ముగిసిపోయిందనుకుంటే అనూహ్యంగా మళ్లీ కొత్త రూపు సంతరించుకోవడం చర్చనీయాంశమైంది.  నర్సంపేటలోనూ జిల్లా కేంద్రం కోసం డిమాండ్ గట్టిగానే ఉంది. తమ వద్దనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. నర్సంపేట జెఎసి నిర్మాణం దిశగా నాయకులు అడుగులు వేస్తున్నారు. తాజాగా మొదలైన పరకాల ఉద్యమం మిగతా ప్రాంతాల్లోనూ ఉత్తేజాన్ని కలిగించే అవకాశాలున్నట్లు చెప్పొచ్చు.  

కొత్త జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత లోపించిన కారణంగా, రాజకీయ ప్రయోజనాల కోణం ఇమిడి ఉన్న కారణంగా ఈ చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపిస్తలేదుని అంటున్నారు రాజకీయ పండితులు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్