బోనాల‌కు త‌ర‌లివ‌చ్చిన బాహుబ‌లి టీం

First Published Jul 28, 2017, 7:03 PM IST
Highlights
  • ఉప్పల్ బోనాలకు బాహుబలి టీం పాత్రధారులు.
  • బోనాలకు తరలివచ్చిన బాహుబలి టీం విగ్రహాలు
  • సెల్ఫీ కోసం పోటీ పడిన భక్తులు.

అనుక్ష‌ణం బిజీగా ఉండె బాహుబ‌లి టీం బొనాలకు త‌ర‌లిరావ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా...! అవునండి బాహుబ‌లి పాత్ర‌ధారులు అంద‌రు బోనాల‌కు సంద‌డి చేశారు.దేశంలో ఎక్క‌డ చూసిన బాహుబ‌లి క్యారెక్ట‌ర్ల గురించి గుక్క తిప్పుకోకుండా చెబుతారు. అందుకే బోనాల‌కు వ‌చ్చే భ‌క్తుల కోసం బాహుబ‌లి టీం ను ప్ర‌త్కేకంగా ప్ర‌తిష్టించారు.


బాహుబ‌లి సినిమా విడుద‌ల అయిన త‌రువాత‌ దేశం అనేక రికార్డులు కొల్ల‌గొట్టింది. రెండు పార్టులుగా విడుద‌ల అయినా ఈ సినిమా ప్ర‌జ‌ల‌కు బాగా చేరువ‌యింది. ముఖ్యంగా అందులో ఉన్న క్యారెక్ట‌ర్లు ప్ర‌జ‌లు బాగా క‌నేక్ట్ అయ్యారు. సినిమాలో ఉన్న ప్ర‌తి పాత్ర‌కు ఒక్కో ప్ర‌త్కేక‌త ఉంది.


తెలంగాణ లో బోనాల పండ‌గ ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే ప‌లు చోట్ల బోనాలు ఉత్స‌వం ముగిసింది. మరికొన్ని చోట్ల ఈ పండుగ కొన‌సాగుతుంది. బోనాల పండుగ‌కు అమ్మ‌వారిని పూజించ‌డం ఆన‌వాయితి. అయితే ఉప్ప‌ల్ బోనాల‌లో అమ్మ‌వారితో పాటు అక్క‌డి ప్ర‌జ‌లు బాహుబ‌లి టీం కూడా  ప్ర‌త్కేకంగా అక‌ర్ష‌ణ‌గా నిలిచింది. బాహుబ‌లి సినిమాలో న‌టించిన పాత్రాలు అమ‌రేంద్ర బాహుబ‌లి, దేవ‌సేనా, బ‌ల్లాల దేవా విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించారు. వీరివే కాకుండా శివ‌గామీ క్యారెక్ట‌ర్ ర‌మ్య‌కృష్ణ‌ను, క‌ట్ట‌ప్ప పాత్ర‌ధారి స‌త్య‌రాజ్‌ను, బిజ్జ‌ల దేవా క్యారెక్ట‌ర్లను కూడా బోనాల‌లో విగ్రహాలుగా ప్ర‌తిష్టించారు.


అమ్మ‌వారి బోనాల ఉత్స‌వానికి వ‌చ్చిన భ‌క్తులందరు బాహుబ‌లి విగ్ర‌హాల‌తో సెల్పీలు దిగ‌డానికి పోటి ప‌డ్డారు. ఒక సారి మీరు కూడా ఆ విగ్ర‌హాల‌ను మీరు ఓ లుక్కేయండి
 

click me!