ఖైరతాబాద్ మహాగణపతికి పగడి ముస్తాబు.. ఇదే తొలిసారి..

By AN TeluguFirst Published Sep 14, 2021, 9:38 AM IST
Highlights

ఈ బృందం సోమవారం అవసరమైన వస్త్రం, జాలి, కుందన్లు,  ఫోమ్  తదితరాలతో మండపం వద్దకు చేరుకుని అక్కడే పగడీని తయారు చేశారు.  వెడల్పు 14 అడుగులు, ఎత్తు ఎనిమిది అడుగులు ఉండే విధంగా దీన్ని రూపొందించారు.  ఆ తరువాత పూజలు చేసి విఘ్నేశ్వరుడి తలపై అలంకరించారు.

ఖైరతాబాద్ లో కొలువుదీరిన మహా గణపతికి తొలిసారిగా పగడి (తలపాగా) సిద్ధం చేశారు. స్థానికులైన రాకేష్ ముదిరాజ్,  ముఖేష్ ముదిరాజ్ పలు ప్రాంతాల్లో చిన్న వినాయకులకు పగడి ఉండటాన్ని గమనించి  మహాగణపతి చేస్తే బాగుంటుందని భావించారు.  

ఈ విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లగా వారు కూడా  అంగీకరించారు. దీంతో బాహుబలి సినిమాలో పగడీలను రూపొందించిన చార్మినార్ కు చెందిన బృందాన్ని వారు ఆశ్రయించారు.

ఈ బృందం సోమవారం అవసరమైన వస్త్రం, జాలి, కుందన్లు,  ఫోమ్  తదితరాలతో మండపం వద్దకు చేరుకుని అక్కడే పగడీని తయారు చేశారు.  వెడల్పు 14 అడుగులు, ఎత్తు ఎనిమిది అడుగులు ఉండే విధంగా దీన్ని రూపొందించారు.  ఆ తరువాత పూజలు చేసి విఘ్నేశ్వరుడి తలపై అలంకరించారు.

పిఓపితో తయారుచేసిన విగ్రహాలు మినహా, మట్టి విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పై క్రేన్లు వద్దనే ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు మానుకున్నారు.  పిఓపి తో తయారుచేసిన విగ్రహాలు వస్తే నెక్లెస్ రోడ్డులోని బేబీ పాండ్ లో నిమజ్జనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

కాగా, ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును  ఆశ్రయించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది.ఈ  తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. దీంతో తెలంగాణ సర్కార్  ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 14న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.వినాయక విగ్రహలు, దుర్గామాత విగ్రహల నిమజ్జనం  చేయకూడదని న్యాయవాది వేణుమాధవ్ పిల్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ నిర్వహించిన హైకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై ఆంక్షలు విధించింది.

షాక్: వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ సర్కార్ రివ్యూ పిటిషన్ కొట్టివేత

 ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయవద్దని ఆదేశించంది. చిన్న విగ్రహలు, పర్యావరణానికి ఇబ్బంది కల్గించని విగ్రహలను రబ్బర్ బండ్ ఏర్పాటు చేసి విగ్రహలను నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

దీంతో హైద్రాబాద్ పోలీసులు గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీకి నోటీసులు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ లో  వినాయక విగ్రహలను నిమజ్జనం చేయవద్దని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది వినాయక విగ్రహల నిమజ్జనం సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వులను  పాటించలేదని  ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ ఒక్క మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యధావిధిగా అమలు చేయాలని కూడ హైకోర్టు ఆదేశించింది.
 

click me!