నారాయణ విద్యార్థుల వీరంగం (వీడియోలు)

Published : Jun 28, 2017, 10:36 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
నారాయణ విద్యార్థుల వీరంగం (వీడియోలు)

సారాంశం

కార్పొరేట్ విద్యావిదానంలో ఇదొక చీకటి కోణం. కార్పొరేట్ విష సంస్కృతికి ఇదొక నిదర్శనం. విద్యార్థులను మరమనుషులుగా మారుస్తున్న వ్యవస్థపై ఇది తిరుగుబాటు. ఖైదీల మాదిరిగా బంధించిన విద్యార్థుల ఆగ్రహానికి ప్రత్యక్ష ఉదాహరణ.  

 

 

 

 

 

 

నిజాంపేట క్రాస్ రోడ్ లోని నారాయణ కాలేజీలో విద్యార్థులు వీరంగం సృష్టించారు. హాస్టల్ గేటుకు తాళాలు వేసి హల్ చల్ సృష్టించారు.

 

3 ఫ్లోర్లలో ఉన్న ఫర్నీచర్, లైట్లను ధ్వంసం చేశారు. ఫర్నీచర్ అంతా ఒకదగ్గర కుప్పేగా పడేసి నిప్పు పెట్టారు.

 

హాస్టల్ ఉండే కాలేజీ స్టాఫ్ ను ఒక రూములో బంధించి తాళం వేశారు. పోలీసులు కూడా లోనికి రాకుండా గేట్లకు తాళాలు వేశారు.

 

మంగళవారం అర్థరాత్రి 1గంట నుంచి తెల్లవారే వరకు ఈ ఆందోళన కొనసాగింది.

 

పోలీసులకు ఫిర్యదు అందడంతో అక్కడికి చేరుకున్నారు. వారు లోపలికి రాకుండా రాళ్లు రువ్వి అడ్డుకున్నారు. 

 

రంజాన్ సెలవు దినాలు కావడంతో విద్యర్థులకు ఔటింగ్ ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు ఈ దాడికి తెగబడ్డట్లు తెలుస్తోంది.

 

ఎట్టకేలకు పోలీసులు లోపలికి చేరుకుని పరిస్థిని అదుపులోకి తెచ్చారు.

 

ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వి వాంట్ ఔటింగ్ అంటూ నినదించారు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే