
బాంబు పేలుడుకు ముందు
ఆయిల్ ట్యాంకర్ పేలిన తర్వాత
పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 150 మంది వరకు సజీవ దహనమయ్యారు.
పంజాబ్ లోని అహ్మద్ పూర్ షర్కియా వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుంచి బయటకు కారుతున్న ఆయిల్ ను పట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు.
పెద్ద సంఖ్యలో జనాలు అక్కడికి వచ్చి ఆయిల్ ను పాత సీసాల్లో, బకెట్లలో, బిందెళ్లో నింపుకెళ్తున్నారు.
ఈ సమయంలో ఒక వ్యక్తి సిగరెట్ అంటించడంతో ఒక్కసారిగా మంటలు రేగి ట్యాంకర్ పేలిపోయింది. దీంతో అక్కడున్నవారంతా కాలి బూడిదైపోయారు.
ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే పాక్ ప్రధాని నవాబ్ షరీఫ్ లండన్ నుంచి హుటాహుటిన పాక్ చేరుకున్నారు.
మృతుల కుటుంబీకులకు ఎక్సగ్రేసియా ప్రకటించారు. ప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.