మేయర్ మాతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషం.. నందమూరి బాలకృష్ణ

Published : Jun 21, 2021, 03:35 PM IST
మేయర్ మాతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషం.. నందమూరి బాలకృష్ణ

సారాంశం

జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మి తన పుట్టిన రోజు వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రోగులతో జరుపుకున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం అని క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. 

మీ ప్రత్యేక జన్మదినోత్సవాన్ని మాతో జరుపుకున్నందుకు, వారి ప్రయాణంలో భాగమైనందుకు ధన్యవాదాలు అని, దేవుడు మీకు  మంచి ఆరోగ్యం, ఆనందాన్నిప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. 

జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పుట్టిన రోజు సందర్బంగా నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేటి నుంచి ప్రారంభమవుతున్న హరితహారంలో భాగంగా లోటస్ పాండ్ లోని పార్క్ లో మేయర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

తన పుట్టిన రోజును పురస్కరించుకుని మేయర్ గద్వాల విజయలక్ష్మి చేపట్టిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన మేయర్ ను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. 

అంతేకాదు తన పుట్టినరోజును పురస్కరించుకుని తలసేమియా వ్యాధిగ్రస్తుల అవసరార్థం భారీ రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించనున్నట్లు మేయర్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction | Telangana | Asianet News Telugu